షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేందుకు.. వెల్లుల్లి ని ఇలా తీసుకోండి.. కచ్చితంగా..?

ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న పెద్దా తేడా లేకుండా మధుమేహం, బీపీ ( Diabetes, BP )లాంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు.

ఈ రెండు వ్యాధులు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి.

నూటికి 70% మందికి ప్రస్తుతం మధుమేహం ఉంటుంది.దీనికి అసలైన కారణం ఏమిటంటే ఆహార శైలి, జీవనశైలిలో వచ్చిన మార్పులేననీ చెప్పవచ్చు.

అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించి సరైన ఆహారం తీసుకుంటే మధుమేహాన్ని అలాగే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.ఇక వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో వెల్లుల్లి ( garlic )బాగా సహాయపడుతుందని తెలిసింది.

అయితే మధుమేహం ప్రస్తుత కాలంలో నయం చేయలేని ఒక ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పాలి.ఈ వ్యాధికి ఇప్పటివరకు కూడా శాశ్వతమైన మందు లేదు.

Advertisement

అయినప్పటికీ కొన్ని ఆయుర్వేద ఇంటి నివారణలతోనే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తాము తీసుకునే ఆహారం విషయంలో మరింత జాగ్రత్త వహించడం చాలా అవసరం.

షుగర్ వ్యాధిగ్రస్తులు కాల్చిన వెల్లుల్లి ( Roasted garlic )రెగ్యులర్ గా తీసుకుంటే షుగర్ లెవెల్ అదుపులో ఉంటాయని కొందరు చెబుతున్నారు.

అయితే ఒక కథనం ప్రకారం బెంగళూరులోని బీమలై హాస్పిటల్ మాజీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పాఖీ శర్మ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.మధుమేహ వ్యాధిగ్రస్తులు వెల్లుల్లి తీసుకోవడం సురక్షితమెనా? అని అడగగా ఆయన.వెల్లుల్లిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు.

అలాగే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ B1, విటమిన్ B3, విటమిన్ B5, విటమిన్ B6, విటమిన్ B9, విటమిన్ C, క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ ఉన్నాయని తెలిపారు.అంతేకాకుండా వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి.అంతే కాకుండా అలిసిన్ అనే అద్భుతమైన సల్ఫరస్ సమ్మేళనం కూడా ఉంది అని ఆయన తెలిపారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

అందుకే కాల్చిన వెల్లుల్లి మధుమేహానికి ఒక దివ్య ఔషధం అని ఆయన తెలిపారు.వెల్లుల్లిని తీసుకోవడం వలన చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుందని తెలిపారు.అంతేకాకుండా టైప్ 2 డయాబెటిస్ ను కూడా నియంత్రించవచ్చని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు