చిరంజీవి బాలయ్య లతో పోటీ పడాలంటే వెంకీ,నాగ్ ఇలా చేయాలి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో కొంతమంది మంచి సినిమాలను చేస్తూ మంచి హీరోగా గుర్తింపు పొందినప్పటికీ మరికొందరు మాత్రం వరుసగా ప్లాప్ సినిమాలు చేస్తూ ఒక్క హిట్టు కోసం ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలయ్య( Balakrishna ) లాంటివాళ్ళు పరుసహిట్లు కొడుతున్నారు.

వాళ్లలాగే మంచి హిట్లు కొట్టాలని చూస్తున్న హీరోలు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హీరోలుగా కొనసాగుతున్న వెంకటేష్ ,( Venkatesh )నాగార్జున లాంటి హీరోలకి అర్జెంటుగా ఒక హిట్ కావాలి ఎందుకంటే వీళ్ళు చేసిన ఇంతకుముందు సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో ప్రస్తుతం వీళ్లు చేస్తున్న సినిమాల మీదనే భారీ అంచనాలను పెట్టుకున్నారు.

కాబట్టి వీళ్ళకి పక్కాగా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అనేది పడాలి లేకపోతే ఇండస్ట్రీలో వీళ్ళు సోలో హీరోగా కొనసాగడం చాలా కష్టమవుతుంది.ఎందుకంటే ప్రస్తుతం యంగ్ హీరోలు మంచి కాన్సెప్ట్ తో వచ్చి మంచి సక్సెస్ లు కొడుతుంటే వీళ్ళు మాత్రం చాలా అవుట్ డేటెడ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ఫ్లాప్ లను అందుకుంటున్నారు.

ఇక వెంకటేష్ గత సినిమా అయిన దృశ్యం 2 ( Drishyam 2 )సినిమా మంచి విజయం సాధించినప్పటికి దానికి మాత్రం పెద్దగా కలక్షన్లు అయితే రాలేదు.ఇక నాగార్జున చివరగా చేసిన సినిమా గోస్ట్ సినిమా భారీ ఫ్లాప్ అయింది దాంతో ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాల మీద చాలా అంచనాలు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా ఈ సినిమాలతో పక్కాగా హిట్టు కొట్టాలి అని చూస్తున్నారు.లేకపోతే సీనియర్ హీరోలైన బాలకృష్ణ ,చిరంజీవి వరుసగా సక్సెస్ లు కొడుతూ వందల కోట్ల కలక్షన్స్ ని రాబడుతుంటే వీళ్ళు మాత్రం ఒక హిట్టు కొట్టడానికి చాలా బాధలు పడుతున్నారు.

Advertisement

ప్రస్తుతం వీళ్ళిద్దరూ సక్సెస్ లు కొట్టి ఇండస్ట్రీలో 100 కోట్ల క్లబ్ లో చేరాలని చాలా ఆశ పడుతున్నారు.మరి ప్రస్తుతం వీళ్ళు చేసే సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో చేరుతారో లేదో చూడాలి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు