కొంతమంది డైరెక్టర్లు తీసే సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి అయినా కూడా అవి బాక్సాఫీస్( box office ) వద్ద పెద్దగా ఆడవు, దానికి కారణం ఆ పర్టికులర్ సిచువేషన్ లో ఆ సినిమాకు సంబంధించిన అంచనాలు ఎక్కువగా ఉండటం గాని, ఆ సినిమా ప్రజెంటేషన్ బాగా లేకపోవడం వల్ల చాలామంది ఆ సినిమాలను చూడడం మానేస్తారు.అలాంటి సినిమాలు ప్లాప్ అవుతాయి అయితే అలాంటి సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి.
కొన్ని సినిమాలు మాత్రం మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ అవి పెద్దగా సక్సెస్ అయితే సాధించలేవు అలాంటి సినిమాలని మనం చాలానే చూస్తూనే ఉంటాం.కాబట్టి ఏ సినిమా అయినా కూడా మంచి విజయం సాధించాలి అంటే ఎక్కువ మంది జనాలకి నచ్చాల్సి ఉంటుంది అందుకే ఒక సినిమా హిట్టు ప్లాపు అనేది నిర్ణయించేది వాళ్లే కాబట్టి సినిమా అనేది వాళ్ళకి నచ్చితే ఈజీగా సక్సెస్ అవుతుంది.
లేకపోతే సినిమా ఫ్లాప్ గా మిగిలిపోతుంది.ప్రస్తుతం అలా ఇండస్ట్రీలో మంచి అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి అవేంటో ఒకసారి మనం తెలుసుకుందాం… అప్పట్లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా చేస్తూ డైరెక్షన్ కూడా చేసిన జానీ సినిమా ( Johnny movie )భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్దకి వచ్చింది ఆ సినిమా బాగున్నప్పటికీ జనానికి పెద్దగా నచ్చలేదు దాంతో ఆ సినిమా ఫ్లాప్ అయింది ఇక ఆ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖలేజా సినిమా కూడా బాగుంటుంది అయినా కూడా ఆ సినిమా పెద్దగా ఆడలేదు.ఇక ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమా కూడా చాలావరకు బాగుంటుంది అయినా కూడా ఆ సినిమా పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది.ఇక ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా సినిమా కూడా చూడడానికి చాలా బాగుంటుంది.
కానీ అది కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు ఇలా ఇవన్నీ సినిమాలను చూస్తుంటే ప్రేక్షకులు ఏ సినిమాని ఆదరిస్తారో మనం కచ్చితంగా చెప్పలేకపోతున్నాం అందువల్లే దర్శకులు ఎలాంటి సినిమా చేయాలి అనేది ముందుగానే నిర్వహించుకుని సినిమాలు చేస్తున్నారు.అందులో కొన్ని ఫ్లాప్ అవుతుంటే మరికొన్ని మాత్రం సూపర్ సక్సెస్ అవుతున్నాయి.