ఈ ఏడాది చివర్లో జరగబోతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana state assembly elections ) తమ సత్తా చాటుతాం అన్నట్లుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తుకు సిద్దం అన్నట్లుగా ఆయన తెలియజేశారు.
కేసీఆర్ పరిపాలన నుండి విముక్తి పర్చడానికి అవసరమైతే తమ పార్టీని విలీనం అయినా చేసేందుకు సిద్ధం అంటూ కోదండరాం సంచలన ప్రకటన చేశారు.తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన నుండి విముక్తి కోరుకుంటున్నారు అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

సూర్యపేట లో నిర్వహించిన తెలంగాణ జన సమితి( Telangana Jana Samithi ) ప్లీనరి సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని… కేసీఆర్( KCR ) నిర్ణయాలు ఉంటున్నాయి అంటూ ఆయన ఆరోపించారు.అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి పని చేయాలని ఈ సందర్భంగా కోదండరాం సారు పిలుపునిచ్చారు.ఎంతటి పెద్ద నిర్ణయాన్ని తీసుకునేందుకు అయినా తాము సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో కోదండరాం సారు యొక్క క్రియాశీలక పాత్ర ను ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు.

అలాంటి కోదండరాం సారు ను కేసీఆర్ పక్కన పెట్టడం… దాంతో ఆయన సొంతంగా పార్టీ పెట్టడం వంటివి చకచక జరిగాయి.గతంలో కాంగ్రెస్ పార్టీతో కోదండరాం పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది.ఈసారి కూడా కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధం అన్నట్లుగా ఆయన సిగ్నల్ ఇచ్చారు.అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ( Congress party ) కోరితే తమ పార్టీని విలీనం చేసేందుకు కూడా సిద్ధం అన్నట్లుగా కోదండరామ్ పేర్కొన్నారు.
ముందు ముందు ఏం జరుగుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో కోదండరాం సారు యొక్క ప్రభావం ఎంత అంటే చాలా మంది జీరో అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సొంతంగా పోటీ చేస్తే సింగిల్ సీటు కూడా గెలిచే అవకాశం లేదు.కనుక పొత్తుకు సిద్ధం అంటున్నారు అంటూ బీఆర్ఎస్ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.







