కేసీఆర్ కు కోదండరాం టెన్షన్ ? 

తెలంగాణ ఉద్యమంలో( Telangana Movement ) కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం( Kodandaram ) కేసిఆర్ కు అప్పట్లో అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ఉండేవారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ( CM KCR ) కు అనేక వ్యూహాలు అందించారు కోదండరాం.

తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోదండరాం ను కేసీఆర్ సంప్రదించే వారు.వీరిద్దరి మధ్య దూరం పెరగడంతో కోదండరాం 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ జన సమితి( Telangana janasamithi ) పేరుతో పార్టీని స్థాపించారు.రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ప్రభావం ఉంటుందని, కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాతో కోదండరాం ఉండేవారు.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్ష పార్టీలతో తెలంగాణ జన సమితి పొత్తు పెట్టుకున్నా, కేసీఆర్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు.

రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది.అయితే త్వరలో జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.కాంగ్రెస్, బిజెపి నుంచి గట్టి పోటీ ఉండబోతుండడం తో కెసిఆర్ టెన్షన్ పడుతున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో, ఆ ప్రభావం తప్పకుండా తెలంగాణలో ఉంటుందనే నమ్మకంతో కోదండరాం ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి తరపున ఎట్టి పరిస్థితుల్లోనైనా అభ్యర్థులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్న కోదండరాం కాంగ్రెస్ కు దగ్గర అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన కోదండరాం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎలాంటి రాజకీయ నిర్ణయాన్ని తీసుకోడానికైనా సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే పార్టీని విలీనం చేయడానికి కూడా సిద్ధం అంటూ మాట్లాడడంతో ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారనే విషయం అర్థం అవుతోంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మినహా, ఏ పార్టీలోనూ తెలంగాణ జన సమితిని విలీనం చేసే అవకాశం లేదు.ఇదే జరిగితే కాంగ్రెస్ కు అదనంగా బలం చేకూరినట్టే.

ఈ వ్యవహారం బిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆందోళన కలిగిస్తుంది.తెలంగాణ జన సమితి కాంగ్రెస్ లో విలీనం అయితే కాంగ్రెస్ కు అదనపు బలం చేకూరుతుందని, ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోందని, ఇప్పుడు ఉద్యమ నేపథ్యం ఉన్న కోదండరాం వంటి వారు కాంగ్రెస్ కు అదనపు బలంగా మారుతారనే అంచనాలో బి ఆర్ ఎస్ ఉంది.

Advertisement

తాజా వార్తలు