మ‌రో యుధ్ధంకి సిద్ధ‌మ‌వుతున్న‌ తెలంగాణ జెఎసి

రెండేళ్ల తెరాస పాల‌న బాగుందంటూ ప్ర‌క‌టించి రెండ్రోజులు కూడా కాక‌మునుపే రాష్ట్రంలో జ‌రుగుతున్న రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై తెలంగాణ జెఎసి అధ్యక్షుడు కోదండరామ్ చేసిన కామెంట్లు సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి.

విద్య‌వంతుల వేదిక సాక్షిగా మాట్లాడిన ఆయ‌న తెలంగాణాని కొట్ల‌డి తెచ్చుకున్నాక‌ కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం తెలంగాణ ప్రజలు బతుకుదెరువు మెరుగుపడేందుకు చర్యలు తీసుకోవ‌టం లేదంటూ తీవ్ర‌స్థాయిలో మండి ప‌డ్డారు.

దీంతో తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన జేఏసీ నేత‌లు గ‌త కొంత కాలంగా ప్రాజ‌క్టుల‌ను మార్చేసో్తంద‌ని, అవ‌సం మేర‌కు మారిస్తే త‌ప్పులేదు కానీ ప్ర‌భుత్వం ఇష్టాను సారంగా మారుస్తోందంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తునే ఉన్నారు.కాగా మల్లన్నసాగర్ భూసేకరణలో ప్రభుత్వం చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించ‌డంతో పాటు భూసేకరణ కోసం గ్రామసభల తీర్మానం లేకుండా బలవంతంగా భూములు లాక్కుంటున్నారంటూ అభ్యంత‌రం వ్య‌క్తం చేసారాయన.2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం, పునరావసం కల్పించాలన్న మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు జేఏసీ అండ‌గా నిలుస్తుంద‌ని ప్ర‌క‌టించారు.మ‌రోవైపు పాల‌నలో లోటుపాట్ల‌ను స‌రి చేసుకోకుంటే మేమే స‌రి చేస్తాం.20 ఏళ్ల పాటు తెలంగాణాకోసం కొట్లాడిన త‌మ‌కు తెలంగాణ‌కు ఏం కావాలో తెల‌వ‌దా? అంటూ తెరాస ప్ర‌భుత్వం పై చేసిన వ్యాఖ్య‌ల‌పై తెరాస ్ర‌శేణులు కారాలు మిరియాలు నూరుతున్నాయి.కాగా త్వరలోనే మల్లన్నసాగర్ ముంపుగ్రామాల్లో మేధాపాట్కర్ పర్యటన‌కు కోదండ‌రాం ఏర్పాట్లు చేసేందుకు సిద్ధం కావ‌టం చూస్తుంటే, విప‌క్షాల‌తో క‌ల్సి, కేసీఆర్‌పై మ‌రో యుధ్ధంకి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నా, విప‌క్ష నేత‌లంతా అధికార పార్టీలో చేరిపోతున్న‌ప్ప‌డు కోదండ‌రాం మాట‌కు లెక్క ఎక్క‌డుంటుంద‌ని మ‌రికొంద‌రు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

నీటిలో నానుతున్న విజయవాడ.. బ్రహ్మం గారి కాలజ్ఞానం పైనే చర్చ 

తాజా వార్తలు