చిరంజీవి 150వ సినిమాకి టైటిల్ ఫిక్స్

ఎప్పుడెప్పుడా అని మెగాఫ్యాన్స్ వేయి కనులతో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోంది.వివి.

వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా తమిళ బ్లాక్బస్టర్ కత్తి చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.ఇన్నిరోజులు చిరంజీవి వ్యక్తిగత సమస్యల వలన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

చిరంజీవి చిన్నకూతురు శ్రీజ పెళ్ళి జరిగిపోవడంతో మెగాస్టార్ మీద ఉన్న ఒత్తిడంతా దూరమైపోయింది.తన 150వ సినిమా మొదలుపెట్టడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు చిరంజీవి.

నయనతార ని హీరోయిన్ గా అనుకుంటున్న ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.ఈరోజు హైదరాబాద్ లోని తాజ్ హోటల్లో తన సన్నిహితులతో చిరంజీవి మాట్లాడుతూ, మరో నెల రోజుల్లో ఈ సినిమా మొదలుపెట్టనున్నట్లు .ఇక ఈ కత్తి రీమేక్ కి "కత్తిలాంటోడు" అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలియజేసారని ఫిలీంనగర్ జనాల సమాచారం.ఎలా ఉందండి టైటిల్ ! .

Advertisement
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.. జేడీఎస్ ఆదేశాలు

తాజా వార్తలు