కృష్ణా జిల్లాలో ఆ సీటు... రెండు పార్టీల‌కూ క‌ష్ట‌మే..!!

సాధార‌ణంగా ఒక‌ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన పార్టీల్లో ఒక‌రికైనా మంచి ప‌ట్టు ఉంటుంది అక్క‌డ‌.కానీ కొన్ని సంద‌ర్భాల్లో అన్ని పార్టీలు వీక్ గానే క‌నిపిస్తుంటాయి.

ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే ఏపీలోని ఉమ్మ‌డి కృష్ణా జిల్లాని.ఎస్సీ నియోజకవర్గం.

ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న తిరువూరులో క‌నిపిస్తోంది.ఇక్కడ వైసీపీ తరఫున రక్షణ నిధి.

వరుస విజయాలు దక్కించుకుంటున్నారు.దీంతో టీడీపీ ఒకింత వెనుకబడిందనే వాదన ఉంది.

Advertisement

గత ఎన్నికల్లో మాజీ మంత్రి కేఎస్ జవహర్ ను ఇక్కడ నుంచి పోటీ చేయించినా.టీడీపీ విజయం దక్కించుకోలేక పోయింది.

కాగా నల్లగట్ల స్వామి దాసు గత ఎన్నికల వరకు యాక్టివ్ గానే ఉన్నా ఇటీవల కాలంలో ఆయన కూడా అనా రోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.దీంతో టీడీపీ తరఫున ఇక్కడ బలమైన వాయిస్ వినిపించే నేత లేడ‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

వైసీపీ టీడీపీలోనూ ఇదే ప‌రిస్థితి

మ‌రోవైపు వైసీపీ నేత‌ రక్షణనిధి గ్రాఫ్ పడిపోయిందనే టాక్ పార్టీలో వినిపిస్తోంది.ఆయన ఎక్కడా కనిపించడం లేదని.

ఆయన వల్ల పనులు కూడా కావడం లేదని స్థానికంగా నాయకులు మాట్లాడుకుంటున్నారు.ఇక మ‌రో వైసీపీ నేత ఇక్క‌డ లేక‌పోవ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం స‌వాలుగా మార‌నుంది.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఈ పరిణామాలతో వైసీపీ ఇక్కడ వచ్చే ఎన్నికల్లో నెగ్గుతుందా.? అనేది సందేహంగా మారింది.ఇటు.

Advertisement

వైసీపీలోనూ.అటు టీడీపీలోనూ.

ఇదే తరహా చర్చ సాగుతోంది.ఎస్సీ నియోజకవర్గంలో సహజంగా ఇతర సామాజిక వర్గాల ప్రభావం ఉంటుంది.

అలా చూసుకున్నా ఇక్కడ టీడీపీకి.వైసీపీకి బలమైన ఇతర సామాజిక వర్గాల ప్రభావం కనిపించడం.దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కూడా ఇక్క‌డ బలమైన నాయకులు లేర‌ని అంటున్నారు.

అయితే వైసీపీ మరోసారి రక్షణనిధికే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.కానీ ఆయన గెలుపు కష్టమని టీడీపీ నేతలు అంచనాలు వేకుంటున్నారు.ఈ క్రమంలో తాము ఎవరిని నిలబెట్టినా.

గెలుపు మాత్రం తమకే దక్కుతుందని చెబుతున్నారు.ఈ పరిణామాలతో తిరువూరు నియోజకవర్గంలో రాజకీయం ఆస‌క్తిగా మారింది.

అయితే ఇక్క‌డ విష‌యం ఏంటంటే ఇటు టీడీపీ అటు వైసీపీ ఈ రెండు పార్టీలు కూడా ప్రజల మధ్య లేవ‌నే టాక్ వినిపిస్తోంది.ఇది కూడా మైన‌స్ గా మారే ప‌రిస్థితి ఉంది ఈ పార్టీల‌కు.

తాజా వార్తలు