శ్రీవారి భక్తులకి బ్యాడ్ న్యూస్ .. భక్తులు లేకుండానే బ్రహ్మోత్సవాలు !

కలియుగ వైకుంఠ దైవం , శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు కొలువుదీరిన ఆ సప్తగిరులని ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.

ఆ శ్రీవారి దర్శనం కోసం నిత్యం కొన్ని లక్షల మంది ప్రపంచం నలుమూలల నుండి వస్తుంటారు కానీ, తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా .

కరోనా నేపథ్యంలో బ్రహ్మోత్సవాలని ఏకాంతంగా జరపబోతున్నారు.ఈ నెల 16 నుంచి తిరుమల శ్రీవారి దసరా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కరోనా మార్గదర్శకాల నేపథ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.ఇటీవల ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.తాజాగా దసరానవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు.

Advertisement

అయితే, భక్తులను అనుమతించాలని మొదటగా అనుకున్నప్పటికీ , కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.భక్తుల క్షేమం కోసమే బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షతులు అన్నారు.

శ్రీవారి సంకల్పంతోనే వాహనసేవలు ఏకాంతంగా జరగనున్నాయని, దైవానుగ్రహం, శ్రీవారి వైభవం తగ్గుతుందని భక్తులు చింతించాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు