పుచ్చకాయ పంట వేసవి పంట.కానీ సంవత్సరం పొడుగున అన్ని కాలాలకు అనువైన రకాలు అందుబాటులోకి రావడం వల్ల రైతులు పుచ్చకాయ పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు.
పొడి వాతావరణం లో కూడా పుచ్చకాయ పంట సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు.అయితే మంచి లాభాలు పొందాలంటే అధిక విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా దఫా, దఫాలుగా స్వల్ప రోజుల వ్యత్యాసంతో విత్తుకోవాలి.
పుచ్చకాయ పంట సాగులో ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే.ఒక ఎకరాకు 10 తండ్రుల పశువుల ఎరువు, 25 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువులు వేసి పొలాన్ని కలియ దున్నుకోవాలి.
ఆ తర్వాత పొలంలో ఎలాంటి అవశేషాలు లేకుండా పొలాన్ని పరిశుభ్రం చేసుకోవాలి.
![Telugu Agriculture, Farmers, Tipstechniques, Melon-Latest News - Telugu Telugu Agriculture, Farmers, Tipstechniques, Melon-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/Techniques-for-Water-Melon-Farming.jpg)
పుచ్చకాయ పంట సాగును బోధన పద్ధతి లేదంటే ఎత్తుబెడ్ల పద్ధతి ద్వారా సాగు చేయాలి.ఏ పద్ధతిలో సాగుచేసిన మొక్కల మధ్య 75 సెంటీమీటర్ల దూరం, సాలుల మధ్య 120 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.పంట విత్తిన 30 రోజుల తర్వాత ఒక ఎకరాకు 30 కిలోల యూరియా అందించాలి.
పంట విత్తిన 60 రోజుల తర్వాత 15 కిలోల యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసుకోవాలి.
![Telugu Agriculture, Farmers, Tipstechniques, Melon-Latest News - Telugu Telugu Agriculture, Farmers, Tipstechniques, Melon-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/Tips-and-Techniques-to-Protect-Water-Melon-Farming.jpg)
పుచ్చకాయ మొక్కకు మూడు లేదా నాలుగు ఆకులు వచ్చినప్పుడు ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారి చేస్తే, బోరాన్ లోపం నిర్మూలించబడడంతో పాటు కాయలలో పగుళ్లను నివారించవచ్చు.పుచ్చకాయ పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే తామర పురుగులు కీలకపాత్ర పోషిస్తాయి.ఈ తామర పురుగులు ఆశించిన మొక్కల ఆకులు ముడతలు పడి పసుపు రంగులోకి మారడం వల్ల మొక్క ఎదుగుదల లోపిస్తుంది.
తొలి దశలోనే ఈ పురుగులను గుర్తించి నివారణ కోసం రెండు మిల్లీ లీటర్ల ఫిప్రోనిల్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.