ప్రధాన నూనె గింజల పంటలలో వేరుశనగ పంట( Groundnut Cultivation ) కూడా ఒకటి.వేరుశనగ పంట సాగు విధానంపై అవగాహన వచ్చిన తర్వాత సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ పంటను చివరి వరకు సంరక్షించుకుంటే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు పొందవచ్చు.
వేరుశనగ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి.మొలకెత్తే శక్తిని 85% కలిగి ఉండే విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.
ఒక కిలో విత్తనాలను మూడు గ్రాముల మాంకోజెబ్ తో విత్తనశుద్ధి చేసుకోవాలి.వేపు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే ఒక కిలో విత్తనాలను రెండు మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేయాలి.

ఎరువుల విషయానికి వస్తే.సేంద్రీయ ఎరువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.ఒక ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు, 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి పొలాన్ని కలియదున్నాలి.ఆ తర్వాత పొలంలో ఇతర పంటల అవశేషాలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగించాలి.
రబీలో సాగు చేయాలనుకుంటే సెప్టెంబర్ రెండవ వారం నుంచి అక్టోబర్ రెండవ వారం వరకు విత్తుకోవచ్చు.వేసవిలో సాగు చేయాలనుకుంటే జనవరి రెండవ వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు విత్తుకోవచ్చు.
వేరుశనగ పంటకు వివిధ రకాల తెగుళ్ల, చీడబీడల బెడద( Pests ) తక్కువగా ఉండాలంటే.మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

ముఖ్యంగా వేరుశనగ విత్తనం( Groundnut Seeds ) ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో పడకుండా నాగలితో విత్తుకోవాలి.వేరుశనగ పంట పూత, ఊడ దిగి సమయంలో ఒక ఎకరం పొలానికి 200 కిలోల జిప్సం మొక్క మొదళ్ళ వద్ద 50 సెంటీమీటర్ల లోతులో వేసి మట్టి ఎగదోయాలి.జిప్సం వల్ల కాయలు బాగా ఊరడంతో పాటు నూనె శాతం పెరుగుతుంది.పంట కాలంలో సుమారుగా 10 నుంచి 12 నీటి తడులు అవసరం.ఊడ దిగేదశ నుండి గింజ గట్టిపడే వరకు నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి.