ముంబై జట్టు బ్యాటర్ తిలక్ వర్మ( Tilak verma ) మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.ఇంకొంతసేపు క్రీజూ లో ఉండి ఉంటే ఫలితాలు కచ్చితంగా తారుమారు అయ్యేవి.
సూర్య కుమార్ యాదవ్- తిలక్ వర్మ( Suryakumar yadav ) లు తొందరగా పెవిలియన్ చేరడంతో ముంబై జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది.ఇక మోహిత్ శర్మ( Mohit sharma )బౌలింగ్ తట్టుకోలేక ముంబై జట్టు ఓటమిని చవిచూసింది.
ముంబై జట్టు ఓడిన కూడా తిలక్ వర్మ అందరి ప్రశంసలు పొందుతున్నాడు.ఏ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కూడా అంచనాలకు మించి సత్తా చాటగలడు.గుజరాత్ బౌలర్ మహమ్మద్ షమీ కి చుక్కలు చూపించాడు.షమీ బౌలింగ్లో నాలుగు బంతులకు నాలుగు ఫోర్లు, ఐదవ బంతికి రెండు పరుగులు, ఆరవ బంతికి సిక్స్ కొట్టడంతో ఒకే ఓవర్ లో 24 పరుగులు వచ్చాయి.
తిలక్ వర్మ 14 బంతులలో ఐదు ఫోర్లు, మూడు సిక్స్ లతో 43 పరుగులు చేసి రషీద్ ఖాన్ ( Rashid khan )బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.ముంబై ఓపెనర్లు నేహల్ 4, రోహిత్ శర్మ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
దీంతో ముంబై జట్టు ఇబ్బందుల్లో పడింది.తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన తిలక్ వర్మ మొదటి బంతికే పాండ్యా బౌలింగ్లో సిక్స్ కొట్టి, షమీ బౌలింగ్ లో బౌండరీల వర్షం కురిపించాడు.
ఇక ముంబై జట్టు కు కాస్త ఊరట లభించింది.దాదాపుగా ముంబై జట్టు గెలిచే అవకాశాలు పెరిగాయని సంబరపడింది.సూర్య- తిలక్ వర్మ క్రీజూ లో ఉంటే గెలుపు ముంబైనే వరుస్తుంది అనుకున్నారు.కానీ రషీద్ ఖాన్ బౌలింగ్లో తిలక్ వర్మ అవుట్ అవ్వడంతో క్రమంగా నెట్ రన్ రేట్ పెరగడం ప్రారంభమైంది.
కాసేపు ఒంటరి పోరాటం చేసిన సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో గుజరాత్ చేతిలో ముంబై 62 పరుగుల తేడాతో ఓడింది.