మరో ఇరవై నాలుగు గంటలు గడిస్తే ఈ విషయం తేలిపోతుంది .ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు( MLC elections ) రంగం సిద్ధమైంది.
ఇప్పటికే రెండు దఫాలు మాక్ పోలింగ్ నిర్వహించిన అధికార పార్టీ ఓటింగ్ విధానం పై తమ పార్టీ సభ్యులకు వస్తున్న అనుమానాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఒక్క ఓటు కూడా వృధా కాకుండా వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది విందు బేటీ లతో రెండు పార్టీలు తమ సబ్యుల తో సమావేశాలు నిర్వహిస్తున్నాయి …వైసీపీ( Ysrcp ) లో .రెబెల్ ఎమ్మెల్యేలు అసంతృప్తులను గుర్తించి వారిని బుజ్జగించే బాధ్యత మంత్రుల కమిటీ అప్పచెప్పారు ,ఒక్కొక్క మంత్రికి 22 మంది ఎమ్మెల్యేలను కేటాయించి ఏడుగురు మంత్రులకు పూర్తిస్థాయి బాధ్యతలు కట్టబెట్టారు .ఆయా ఎమ్మెల్యేలు అధికార పార్టీకి ఓటేసేలా చూడాల్సిన బాధ్యత వారిదే అన్నమాట.

నిజానికి ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయని అంచనాలు వచ్చాయి అయితే చివరి నిమిషం లో తెలుగు దేశం తీసుకున్న స్టెప్ తో పరిణామాలు రసవత్తరంగా మారాయి.ఎన్నిక అనివార్యమైంది .పట్టభద్రులు ఎమ్మెల్యే ఎన్నికలలో తెలుగుదేశం విజయంతో( TDP ) ఇప్పుడు ఈ గెలుపు అధికార పార్టీకి పూర్తిస్థాయి ప్రెస్టేజ్ క్వశ్చన్ లా మారిపోయింద.అందుకే ఇప్పుడు రెండు పార్టీల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది.

తెలుగుదేశానికి విజయం కష్టసాధ్యం లాగే కనబడుతున్నా మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఏమైనా జరగొచ్చు అన్న అంచనాలు వినపడుతున్నాయి 23 మంది ఎమ్మెల్యేలలో వాస్తవానికి టిడిపి కి మిగిలింది 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే .మిగిలిన నలుగురు వైసిపి అనుబంధ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.అయితే వైసిపి రెబల్ ఎమ్మెల్యేలు కూడా కచ్చితంగా టిడిపికి ఓటు వేస్తారని తమ బలాన్ని 21 వరకు ఊహించుకుంటుంది ….
ఇక కావలసిన ఒక్క ఓటు కూడా రహస్య బ్యాలెట్ ఓటింగ్ అవడం వలన ఏదో ఒక రకంగా వచ్చి పడుతుందని తెలుగుదేశం లెక్కలు వేసుకుంటుంది.ఇంతమంది ఎమ్మెల్యేలలో జగన్ ప్రభుత్వం పైన అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు అయితే బయటపడడానికి సిద్ధంగా లేరు .ఎవరైనా తెగించి ఓటు వేస్తే మాత్రం వైసీపీకి నైతికపతనం మొదలైనట్టుగానే భావించవచ్చు ఎంత ఎంత పెద్ద లక్ష్యమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అందుకే ఒక్క ఓటు కూడా పార్టీల గెలుపు వాటములను నిర్ణయించే పరిస్థితి రావడం తో ఇప్పుడు పార్టీ నేతలకు టెన్షన్ తో నిద్ర కూడా పట్టడం లేదని సమాచారం .







