తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు మండలాల్లో పెద్దపులి సంచరిస్తుందని తెలుస్తోంది.
తాజాగా గోపాలపురం( Gopalapuram ) మండలం చిట్యాలలో( Chityala ) పెద్దపులి సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు.ఈ మేరకు పామాయిల్ తోటలో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు.
పెద్దపులి సంచారం నేపథ్యంలో చిట్యాల సమీప ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అయితే గోపాలపురంతో పాటు దేవరపల్లి మండలంలోనూ పెద్దపులి సంచరిస్తుందని తెలుస్తోంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పెద్దపులి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.