అడవికి సింహం తరువాత అన్నీ పులినే.సింహం చూసి మిగతా జంతువులు ఏ విధంగా అయితే వణికిపోతాయో, పులిని ( Tiger ) చూసి కూడా అదే పరిస్థితి.
అయితే అలాంటి పులి మిగతా జంతువులను చూసి భయపడడం కలలో కూడా ఎవ్వరూ ఊహించరు.అయితే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో సరిగ్గా అదే జరిగింది.
సాధు జంతువుగా పిలవబడే ఏనుగుని ( Elephant ) చూసి ఓ పులి గజగజా వణికిపోయింది.దాంతో ఇక చేసేదేమిలేక పొదల్లో నక్కినక్కి దాక్కోండి.
కాగా దానికి సంబందించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో( Social Media ) తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోని గమనిస్తే అందులో పులి అడవిలో అటు ఇటు షికారు చేస్తుంది.ఇంతలో ఓ ఏనుగు హఠాత్తుగా దానికి దర్శనం ఇస్తుంది.అయితే, ఆ ఏనుగు మాత్రం పులిని గమనించదు.
అదే అదృష్టం అనుకొని ఆ పులి పక్కనే ఓ గుబురుగా వున్న గడ్డిలోని దాక్కుంటుంది.ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఏనుగులు వెళ్లిపోతుంటాయి.
ఇంతలో పులి నెమ్మదిగా లేచి ఆ ఏనుగుల దారిని గమనించి, తరువాత తన దారి అది చూసుకుంటుంది.కాగా దానికి సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద ‘అడవికి రాజు ఏనుగులకు దారి ఇచ్చింది’ అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు.

దాంతో, ఆ వీడియో కాస్త తెగ వైరల్ అవుతోంది.కాగా ఆ వీడియోని చూసిన నెటిజన్లు మిక్కిలి ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఇలాంటి దృశ్యం తామెన్నడూ చూడలేదని కామెంట్లు పెడుతున్నారు.అయితే ఈ వీడియో మొదట వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ విజేత సింహ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అక్కడే ఇది వైరల్ అయింది.
ఆ తరువాత ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద దానిని గమనించి మరలా తన ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం జరిగింది.దాంతో ఈ వీడియో మరింతమందికి రీచ్ అయింది.







