టీడీపీ ,జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీకి వచ్చారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చించుకుని, ఏ ఏ స్థానాల్లో టిడిపి పోటీ చేయాలి.
ఎక్కడ జనసేనకు సీట్లు కేటాయించాలి అనే విషయంపై ఒక క్లారిటీ కి వచ్చారు.జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలను ఆ పార్టీకి కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించడంతో , ఎటువంటి ఇబ్బందులు లేకుండానే ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం ముగిసింది.
అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రెండు పార్టీలు చేయలేదు.సంక్రాంతి పండుగ తరువాత అధికారికంగా టిడిపి ,జనసేన పోటీ చేయబోయే స్థానాలను ప్రకటించాలని రెండు పార్టీల అధినేతలు నిర్ణయించుకున్నారు.

ఒకపక్క ఏమి అధికార పార్టీ వైసీపీ టికెట్లు వ్యవహారంపై దృష్టి సారించింది.ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో, తాము కూడా అభ్యర్థులను ప్రకటించి క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో టిడిపి, జనసేన ( TDP, Jana Sena )కార్యకర్తలు కలిసి పని చేస్తారని , వైసీపీ( YCP ) ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ,అది తమకు కలిసి వస్తుందని ఈ రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి.అయితే ప్రస్తుతం బిజెపి కూడా టిడిపి జనసేన తో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో, ఒకవేళ బిజెపితో పొత్తు కుదిరితే ఆ పార్టీకి ఎక్కడెక్కడ సీట్లు సర్దుబాటు చేస్తారనేది తేలాల్సి ఉంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి తమతో కలిసి వచ్చినా రాకపోయినా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో అటు చంద్రబాబు( Chandrababu Naidu ), ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నారు.సంక్రాంతి నాటికి వైసిపి నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ రాబోతుండడం తో ఆ తర్వాతే తమ రెండు పార్టీల అభ్యర్థులను ప్రకటించాలని ఆలోచనతో చంద్రబాబు పవన్ ( Pawan kalyan )ఉన్నట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.