ఐపీఎల్ 2022లో భాగంగా నిన్న రాత్రి పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో ఆఖరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ నెలకొందంటే అతిశయోక్తి కాదు.
ఇలాంటి థ్రిల్లింగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టీమ్ విజయం సాధించింది.ఈ విజయంలో డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు.
ఈ విధ్వంసకర బ్యాటర్ 51 బాల్స్ లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులు చేసి ఒంటిచేత్తో టీమ్ ని గెలిపించాడు.ఈ ప్లేయర్ నాటౌట్‌గా నిలవడం మరో విశేషం.
వాస్తవానికి గుజరాత్ టైటాన్ 87 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది.వీరంతా కూడా స్టార్ ప్లేయర్లే కావడం వల్ల ఇక గుజరాత్ ఓడిపోవడం ఖాయం అని అందరూ భావించారు.
ఈ క్రమంలోనే డేవిడ్ మిల్లర్ క్రీజ్ లోకి దిగి బ్యాట్ తో రెచ్చిపోయాడు.దీంతో ఒక బాల్ మిగిలి ఉండగానే గుజరాత్ టైటాన్స్ విజయం సొంతం చేసుకుంది.
రషీద్ ఖాన్ కూడా ఈ విషయంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. క్రిస్ జోర్డన్ బౌల్ చేసిన 18వ ఓవర్లో రషీద్ ఖాన్ 4 బంతులను ఉతక బాదుడు బాదాడు.ఈ ప్లేయర్ వరుసగా 6, 6, 4, 6, కొట్టి జట్టును విజయతీరాలకు వైపు నడిపించాడు.19 ఓవర్లో రషీద్ ఔట్ అయినప్పటికీ మిల్లర్ చక్కగా ఆడి జట్టును గెలిపించాడు.

ఈ రసవత్తర మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ మొదట చాలా తడబడింది.తర్వాత మంచి కం బ్యాక్ తో 19.5 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 170 పరుగులు చేసి గెలుపును ముద్దాడింది.ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందించింది.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్లు కూడా బౌండరీలతో మ్యాచ్ ను రసవత్తరంగా మార్చారు.ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 48 బాల్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి వావ్ అనిపించాడు.