హైదరాబాద్ బంజారాహిల్స్ లో మూడు కార్లు దగ్ధం..!!

హైదరాబాద్ లో( Hyderabad ) మూడు కార్లు దగ్ధమైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4 లో( Banjara Hills Road No -4 ) మూడు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలుస్తోంది.

ఒక్కసారిగా కార్లు( Cars ) మంటల్లో చిక్కుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

అయితే పార్క్ చేసిన కారును స్టార్ట్ చేస్తుండగా మంటలు ఎగిసిపడ్డాయని పోలీసులు తెలిపారు.ఈ మంటల్లో మొత్తం మూడు కార్లు కాలి బూడిదయ్యాయి.స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.

మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!
Advertisement

తాజా వార్తలు