కమలా హారిస్ ను చంపేస్తానని బెదిరింపులు.. యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు.. !

కొందరు చేసే పనులను చూస్తే అది పిచ్చో, వెర్రినో అర్ధం కాదు.

ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియా ప్రతి వారికి అందుబాటులో ఉండటం వల్ల దీన్ని వేదికగా చేసుకుని చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది.

ఇలాగే చేసిన ఓ యువతి ఊచలు లెక్కపెడుతుంది.ఆ వివరాలు చూస్తే.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను చంపేస్తానని బెదిరించిన 39 ఏళ్ల నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు.ఫ్లోరిడాలో పనిచేస్తున్న నివియనీ పిట్టిట్ ఫెల్ఫ్స్ అనే నర్సు, కమలా హారిస్ ను హత్య చేస్తానని వివాద స్పదంగా వ్యాఖ్యానించింది.

కాగా ఈ విషయంలో విచారణ జరిపిన యూఎస్ సీక్రెట్ సర్వీస్, ఆమెను అరెస్ట్ చేసింది.కమలా హారిస్ నువ్వు చనిపోబోతున్నావు, నీకు రోజులు దగ్గర పడ్డాయని ఆమె వ్యాఖ్యానించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

Advertisement

ఇకపోతే ఈ మహిళ నల్లజాతి స్త్రీ కావడం, అమెరికాలో నల్లజాతీయుల పై జరుగుతున్న దాడుల నేపధ్యంలో ఆగ్రహాంతో, ఈ బెదిరింపులకు పాల్పడ్డదని భావిస్తున్నారట అధికారులు.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి
Advertisement

తాజా వార్తలు