దక్షిణాఫ్రికా కరోనా వల్ల ఈ ముప్పు తప్పక పోవచ్చట.. ?

చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఎన్నో దేశాలను గడగడలాడించి, ఆర్ధికమాంధ్యాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.అంతే కాకుండా అనేక విధాలుగా రూపాంతరం చెందింది.

 Mutations, South African, Corona Virus, Researchers-TeluguStop.com

ఇప్పటికి పలుదేశాల్లో విజృంభిస్తుంది.కొన్ని దేశాలైతే లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.

అదీగాక ఇటీవల బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో తీవ్ర కలకలం రేపింది.అయితే తాజాగా దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ పై చేసిన ఓ అధ్యయనంలో షాకింగ్ న్యూస్ బయటపడిందట.

అదేమంటే దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ యాంటీబాడీల నుంచి కూడా తప్పించుకుంటుందని, కరోనా సోకిన వ్యక్తికి మళ్లీ సోకే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని వెల్లడిస్తుందట ఈ అధ్యాయనం.

కాగా, దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ కు 501Y.V2గా నామకరణం చేశారట శాస్త్రవేత్తలు.ఇక ఈ దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ కరోనా వ్యాక్సిన్ పనితీరు పైనా ప్రభావితం చూపుతుందని అంటున్న పరిశోధకులు వ్యాక్సిన్ సజావుగా పనిచేసేందుకు ఈ నూతన స్ట్రెయిన్ ప్రతిబంధకంగా మారుతుందని భావిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube