బీజేపీ టికెట్ల కోసం వేలకొద్దీ దరఖాస్తులు ! వీరేందుకు దూరం ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిజెపి( BJP ) కి భారీగానే దరఖాస్తులు వచ్చి చేరాయి.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆశవాహులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్ తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ దరఖాస్తులను స్వీకరించింది .త్వరలోనే అభ్యర్థుల ప్రకటన చేసేందుకు సిద్ధమవుతుండగా,  బిజెపి కూడా ఇదే విషయంపై ఫోకస్ పెట్టి పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన వారం రోజుల వ్యవధిలోనే 6011 దరఖాస్తులు వచ్చాయి.

ఒక్కో నియోజకవర్గంలో నుంచి చాలానే దరఖాస్తులు రావడంతో,  ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.  తెలంగాణలో బిజెపి గ్రాఫ్ బాగా తగ్గిందని , ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరు అంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసిన నేపథ్యంలో,  బిజెపి నుంచి పోటీ చేసేందుకు భారీగా దరఖాస్తులు రావడంతో,  తాము ఎంత బలంగా ఉన్నామనే విషయాన్ని బిజెపి చెప్పుకుంటుంది.

అయితే బిజెపి నుంచి పోటీ చేసేందుకు అప్లికేషన్ తో పాటు ఎటువంటి రుసుము లేకపోవడం వల్లే ఈ స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయనే సెటెర్లు వస్తున్నాయి.

Advertisement

బీజేపీ >( BJP )అధిష్టానం పార్టీ తరుపున పోటీ చేసేందుకు ముఖ్య నాయకులందరినీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని , కీలక నేతలంతా అసెంబ్లీకి పోటీ చేయాలని సూచించింది .అయితే ఈ కీలక నేతల్లో చాలామంది దరఖాస్తు చేసుకోకపోవడం అనే క అనుమానాలకు తావిస్తోంది.ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి , ( Kishan Reddy )ఎంపీలు లక్ష్మణ్,  బండి సంజయ్, అరవింద్ , సోయం బాపూరావు,  డీకే అరుణ, విజయశాంతి,  బూర నరసయ్య గౌడ్ , చింతల రామచంద్రారెడ్డి,  రామచందర్రావు ,ఎన్ వి ఎస్ ప్రభాకర్,  జయసుధ , ఇంద్రసేనారెడ్డి,  వివేక్ వెంకటస్వామి వంటి ముఖ్య నేతలు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు.

అలాగే కేసిఆర్ పై పోటీ చేస్తాను అని ప్రకటించిన ఈటెల రాజేందర్ కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు .కాకపోతే ఈటెల తరఫున గజ్వేల్ నుండి ఆయన అభిమానులు దరఖాస్తు చేశారు ముఖ్య నేతలు అంతా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోకపోవడానికి కారణాలు ఏమిటనే దానిపైన పార్టీలో చర్చ జరుగుతోంది.

పార్లమెంట్ కు పోటీ చేసే ఉద్దేశంతో కొంతమంది అప్లికేషన్లు పెట్టుకోలేదని,  మరి కొంతమంది జిల్లా మీటింగ్ లోని తాము పోటీ చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో దరఖాస్తు చేసుకోలేదని, ఇంకొంతమంది నేరుగా ఇంద్రసేనారెడ్డికే తమ అప్లికేషన్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది.ఇక పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టును ఈనెల చివరన గానీ , లేక అక్టోబర్ మొదటివారంలో ప్రకటించాలని బిజెపి

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు