టీడీపీ కి మరో కీలక నేత గుడ్ బై!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ లో టీడీపీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం విదితమే.అయితే ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవ్వడం కంటే కూడా ఇప్పటికే టీడీపీ ని వీడి పలువురు కీలక నేతలు బీజేపీ లో చేరారు.

 Thota Thrimurthulu To Quit Tdpparty Ycp-TeluguStop.com

అయితే ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ తింటూ అల్లాడుతున్న టీడీపీ కి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇంతకీ ఆ నేత ఎవరో కాదు టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.

తూర్పు గోదావరి లో కీలక నేతగా ఉన్న తోట ఇప్పుడు ఫ్యాన్ గాలి వైపు మళ్లనున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.ఆయన ఈ నెల 18న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

త్రిమూర్తులతో పాటుగా టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.దీని పైన సీఎం జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

గత ఎన్నికల ముందు నుంచి కూడా టీడీపీ అధినాయకత్వం పై తోట పూర్తి అసహనం లో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలు విడుదల అయిన తరువాత తోట సారథ్యంలోనే టీడీపీ కాపు నేతల సమావేశం జరగడం కూడా చూస్తుంటే ఆయన ఏ స్థాయిలో టీడీపీ పార్టీ ని వ్యతిరేకిస్తున్నారో అన్న విషయం అర్ధం అవుతుంది.

అయితే అప్పుడే ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు మాత్రం

ఇది ఖాయం అంటూ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఒకవేళ తోట గనుక వైసీపీ కండువా కప్పుకుంటే మాత్రం తూర్పు గోదావరి జిల్లా లో టీడీపీ కి గట్టి దెబ్బ పడనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube