తెలంగాణ చరిత్రలో ఆ ముగ్గురే గొప్ప ముఖ్యమంత్రు లు : కేటీఆర్

తెలంగాణలో ఎన్నికలు( Telangana Elections ) దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాన్ని ముమ్మరం చేసిన అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు తటస్థ ఓటర్లను ఆకట్టుకునే ప్రకటనలు షురూ చేశాయి .తెలంగాణ లో పెద్ద సంఖ్య లో ఓట్లు కలిగి ఉన్న ఆంధ్రా మూలాల ఓటర్లను ఆకట్టుకోవడానికి చూస్తున్నాయి .

 Those Three Are The Greatest Chief Ministers In The History Of Telangana: Ktr-TeluguStop.com

ఆ దిశగా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం అనుకూల ఓటు బ్యాంకు ను గంప గుత్తగా చేజిక్కించుకోవడానికి తెలుగుదేశం అదినేత పై తన అభిమానం ఒలక బోస్తుండగా, ఇప్పుడు తమ వంతు అన్నట్టుగా బిఆర్ఎస్ కూడా ఆంధ్రా సెటిలర్ల ఓట్లను యధాశక్తి ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.అయితే ప్లాన్ మార్చి తెలుగుదేశం తో పాటు వైఎస్ఆర్ అభిమానులు ఓట్ల కోసం కూడా కేటీఆర్ టార్గెట్ చేసినట్లుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.

Telugu Brs Paty, Chandra Babu, Cm Kcr, Congress, Revanth Reddy, Telangana, Ysraj

ఇటీవల ఒక మీడియా తో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ లో గత 25 సంవత్సరాల చరిత్రలో ముగ్గురే గొప్ప ముఖ్యమంత్త్రు లు గా నిలుస్తారని, ఒకరు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాగా, మరొకరు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అని మూడు తమ నాయకుడు కేసీఆర్ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Telugu Brs Paty, Chandra Babu, Cm Kcr, Congress, Revanth Reddy, Telangana, Ysraj

చంద్రబాబుది ప్రొ అర్బన్, ప్రో- బిజినెస్ మోడల్ కాగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ది ప్రో -విలేజ్, ప్రొ-పూర్ మోడల్ అని తమ నాయకుడిది కేసీఆర్ ది మాత్రం అరుదైన సమతుల్యత అని ఆయన అర్బన్ శ్రేయస్సుతోపాటు అగ్రికల్చర్ కు కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చారని , ఈ ముగ్గురు నాయకులు మాత్రమే తెలంగాణలో ప్రజల జీవితాల పై గణనీయమైన ప్రభావం చూపారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.తద్వారా తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఓటు బ్యాంకు తో పాటు తెలుగుదేశం అనుకూల ఓటు బ్యాంకు ని రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఓట్లను కూడా ఒకేసారి కేటీఆర్ టార్గెట్ చేసినట్లయ్యింది .ఇప్పటికే రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తనకు చంద్రబాబు అంటే ఇష్టమని ఓపెన్ గాబొల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం ఓటర్లతో పాటు అనుకూలం మీడియాను కూడా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేయగా ఇప్పుడు విరుగుడు మంత్రంగా కేటీఆర్ ఈ ఇద్దరి నాయకుల అభిమానులు టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది .మరి ఆయా నాయకుల అభిమానులు ఈ రెండు పార్టీలలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube