మా టీవీ లో ప్రసారమయ్యే కలర్స్ ప్రోగ్రాం ద్వారా ఇండస్ట్రీలో యాంకర్ గా ఫేమస్ అయింది స్వాతి రెడ్డి(Swathi Reddy).ఇక ఈమె తన కలర్స్ ప్రోగ్రాం కి స్టార్ హీరో హీరోయిన్స్ ని పిలిచి వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అడిగి తెలుసుకునేది.
అలా ఈ షో విజయవంతంగా సక్సెస్ అవడంతో స్వాతి రెడ్డి ని కలర్స్ స్వాతి (Colours Swathi) అని పిలవడం మొదలుపెట్టారు.ఇక స్వాతి రెడ్డి యాంకరింగ్ కి పులి స్టాప్ పెట్టి సినిమాల్లో హీరోయిన్ గా చేయడం మొదలు పెట్టింది.
అలా డేంజర్, అష్ట చమ్మా, కార్తికేయ, స్వామి రారా, సుబ్రమణ్యపురం, కలవరమాయే మదిలో, గోల్కొండ హై స్కూల్,బంగారు కోడిపెట్ట వంటి సినిమాల్లో చేసింది.
ఆ తర్వాత 2018లో వికాస్ వాసు (Vikas Vasu) అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇక వీరిద్దరి వైవాహిక బంధం చాలా సజావుగా సాగుతున్న సమయంలోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది కలర్స్ స్వాతి.అయితే రీసెంట్ గా కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతుంది అంటూ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
అంతే కాదు ఈ విడాకుల వార్తలపై స్వాతి రెడ్డి కనీసం స్పందించడానికి కూడా రెడీగా లేదు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో స్వాతి రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో డేంజర్ (Danger) అనే సినిమా చేసే సమయంలో అల్లరి నరేష్ (Allari Nareh) నా దగ్గరికి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి స్వాతి నీ సీక్రెట్ వీడియో ఒకటి ఫోన్లో ఎంఎంఎస్ రూపంలో వస్తుంది.ఒకసారి చూడు అని నాకు చూపించారు.దాంతో ఆ వీడియో చూసి నేను చాలా బాధపడిపోయి ఛీ ఛీ మనుషులు ఇంత దరిద్రంగా తయారయ్యారా.

మరి ఇంత నీచమా.అని భావించాను.ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అవ్వాలి అని డెసిషన్ తీసుకున్నాను.కానీ ఆ సమయంలో నా ఫ్రెండ్స్ అందరూ నాకు ధైర్యం చెప్పి ఇలాంటివి పట్టించుకోకూడదు సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది జనాలు ఇలాంటివి ఫేస్ చేసిన వాళ్ళే వాటిని తట్టుకొని నువ్వు నిలబడాలి అని చెప్పారు అంటూ స్వాతి (Swathi) చెప్పుకొచ్చింది.








