పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో, ఎక్కడ ఉందో తెలుసా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ భారీగా క్రేజ్ ని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.

టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలలో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో పవన్ కళ్యాణ్ టాప్ ఫైవ్ లో ఒకరు అని చెప్పవచ్చు.ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో తొలిప్రేమ సినిమా కూడా ఒకటి.

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కెరియర్ లో మైలురాయిగా చెప్పుకోదగ్గ సినిమాలలో తొలిప్రేమ సినిమా కూడా ఒకటి.అప్పట్లో ఈ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.

అంతేకాకుండా అప్పట్లోనే ఈ సినిమా ఒకటి రెండు ని సెట్ చేసింది.ఈ సినిమా పవన్ కళ్యాణ్ ని యూత్ కి మరింత బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది అని చెప్పవచ్చు.

Advertisement

ఇక తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో అందం అభినయం, అమాయకత్వమైన పాత్రల్లో నటించి కుర్రకాన్ని ఆకట్టుకోవడంతోపాటు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది కీర్తి రెడ్డి.

అయితే నటిగా రాణిస్తున్న సమయంలోనే ఉన్న ఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది కీర్తి రెడ్డి.

ఆమె ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అన్న విషయాలు కూడా చాలామంది అభిమానులకు తెలియదు.ఇంకా తొలిప్రేమ సినిమా విడుదల అయ్యే దాదాపు పాతికేళ్లు అయిన సందర్భంగా ఆయన గురించి అభిమానులు సినీ ప్రియులు ఆరా తీయడం మొదలుపెట్టారు.ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కాగా కీర్తి రెడ్డి తొలిప్రేమ సినిమా తర్వాత హిందీ తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసింది.ఆ తర్వాత అక్కినేని హీరో సుమంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

త్వరలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా.. ఆ వివాదంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇదే!
కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారా.. అసలేం జరిగిందంటే?

కానీ వారి దాంపత్య జీవితం ఎక్కువ రోజులు నిలువ లేకపోయింది.పెళ్లి చేసుకున్న ఏడాదికె విడాకులు తీసుకుని విడిపోయారు.

Advertisement

తర్వాత కీర్తి రెడ్డి సినిమాలకు దూరం అయింది.పెళ్లి తర్వాత ఆమెకు అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా నటనకు గుడ్ బాయ్ చెప్పేసింది కీర్తి.అనంతరం ఒక ఎన్నారైని రెండో పెళ్లి చేసుకుని ప్రస్తుతం భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడింది.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ అమెరికాలో సెటిల్ అయ్యింది.

అయితే ఇటీవల ఇండియాలో ఆమె బంధువులకు సంబంధించిన ఒక ఈవెంట్ లో పాల్గొంది.కాగా ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అప్పటికి ఇప్పటికీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తుంది కీర్తి రెడ్డి..

తాజా వార్తలు