ప్రతి వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదలవుతున్న సినిమాలలో ఎక్కువ సినిమాలు ప్రేక్షకులలో క్రేజ్ ను ఎంతగానో పెంచుకుంటున్నాయి.ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలలో ఆదికేశవ సినిమాపై ఎక్కువ అంచనాలు ఏర్పడ్డాయి.వైష్ణవ్ తేజ్, శ్రీలీల( Vaishnav Tej ) కాంబోలో తెరకెక్కిన ఆదికేశవ ఈ నెల 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాల్లో కోటబొమ్మాళి పీఎస్( Kotabommali P S ) సినిమాపై కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాలోని లింగి లింగి లింగి లింగిడి సాంగ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
విక్రమ్ గౌతమ్ మీనన్ కాంబోలో తెరకెక్కిన ధృవ నక్షత్రం సినిమా కూడా పెద్దగా అంచనాలు లేకుండా అదే తేదీన థియేటర్లలో విడుదలవుతోంది.చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన పర్ ఫ్యూమ్ సినిమా కూడా 24న థియేటర్లలో విడుదల కానుంది.
మాధవే మధుసూదన అనే చిన్న మూవీ కూడా ఆ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఓటీటీలలో స్ట్రీమింగ్ కానున్న సినిమాల విషయానికి వస్తే నవంబర్ 24వ తేదీన చావర్ మలయాళ వెర్షన్ సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 20వ తేదీన స్టాంపెడ్ ఫ్రమ్ ది బిగినింగ్, నవంబర్ 22న స్క్విడ్ గేమ్ ది ఛాలెంజ్, నవంబర్ 23న పులిమడ, మై డైమన్ నవంబర్ 24వ తేదీన విజయ్ లియో, డాల్ బాయ్, నవంబర్ 25న గ్రాస్ టురిస్మో తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ కానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 24వ తేదీన ది విలేజ్( The Village ) వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా బుక్ మై షోలో నవంబర్ 22వ తేదీన ఒప్పైన్ హైమర్ అనే హాలీవుడ్ సిరీస్, యాపిల్ టీవీ ప్లస్ లో నవంబర్ 22వ తేదీన హన్నావాడింగ్ రూమ్ అనే హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.