ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్ స్నేహానికి తార్కాణం ఈ వీడియో... మరీ అంత క్లోజా?

టీమిండియా మంచి ఫామ్ లో వుంది.న్యూజిలాండ్ తో జరిగిన వన్డే ఇంకా T20 సిరీస్ లు కైవసం చేసుకొని సత్తా చాటింది.

ఈ ఈ సిరీస్ నేపథ్యంలో శుభ్‌మన్‌ గిల్ గురించి మాట్లాడుకోవాలి.రాబోతున్న వరల్డ్ కప్ కి ముందు అతను మంచి ఫామ్ కనబరుస్తుండడం విశేషం.

వరుస సెంచరీలతో రెచ్చిపోయి, జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నాడు గిల్.ఇక కివీస్ తో జరిగిన చివరి T20లో గిల్ శతకంతో చెలరేగిపోయి T20 ప్లేయర్ గా పనికిరాడన్న రూమర్స్ ని కొట్టి పారేసాడు.

ఈ క్రమంలో ఇషాన్ కిషన్ మాత్రం తన పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు అనే మాటలు వినబడుతున్నాయి.

సిరీస్ ముగిసి పోయిన తరువాత ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్, యజ్వేంద్ర చహల్లు కలిసి చేసిన ఫన్నీ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది.పాపులర్ యూత్ షో అయినటువంటి MTV రోడీస్ ఆడిషన్ ఎపిసోడ్ ని ఈ ముగ్గరు స్పూఫ్ చేసారు.దానికి చహల్ దర్శకత్వం చేయగా.

గిల్, ఇషాన్లు తమ యాక్టింగ్ తో దుమ్ము దులిపేసారు.ఈ వీడియోలో ముఖ్యంగా ఇషాన్ కిషన్ గొరిల్లా లాగా జంప్ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది.

ఆడిషన్లో భాగంగా సరైన ప్రదర్శన ఇవ్వని గిల్ ని ఇషాన్ కిషన్ తిట్టడం.ఆపై చెంపలు వాయించుకోమనడం లాంటివి సరదాగా అనిపిస్తాయి.

కాగా దీనికి సంబంధించిన వీడియో గిల్ తన ఇన్స్టా వేదికగా షేర్ చేశాడు.సదరు వీడియోను నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న 4 టెస్టు మ్యాచ్ సిరీస్ కోసం ఇప్పటికే టీమిండియా నాగూర్ కి చేరుకుంది.ఫిబ్రవరి 9న తొలిటెస్టు మొదలు కానుంది.ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా కీలకం అని చెప్పుకోవాలి.ఇప్పటికే WTC టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనలు చేరుకుంది.

ఆసీస్తోతో సిరీస్లు టీమిండియా 3-1తో గెలిస్తే.డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube