వైసిపి అధిష్టానం నన్ను అనుమానించిన తర్వాతే నిర్ణయం తీసుకున్న.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నామీద రాష్ట్రంలోని మంత్రులు రీజనల్ కోఆర్డినేటర్లు ఎమ్మెల్యేలు ముప్పేట దాడి చేస్తున్నారు.రుద్రాక్ష పట్టుకుని ప్రమాణం చేస్తున్న నేను గాని తప్పు చేసి ఉంటే నన్ను శిక్షించమని ఆ భగవంతుని కోరుకుంటున్నా.

 The Decision Was Taken Only After The Ycp Leadership Suspected Me.. Kotamreddy-TeluguStop.com

నేను తప్పు చేయకుంటే ఓ దేవుడా నాకు అండగా నిలబడు.నా కుటుంబం నీ కుటుంబం వేరని ఎప్పుడూ అనుకోలేదు అనిల్.

ఏదైనా ఉంటే నన్ను మాట్లాడు నన్ను నా బిడ్డల గురించి ఎందుకు అనిల్.నాకు అధికార దాహం ఉంటే ఆనాడే తెలుగుదేశం పార్టీలో చేరేవాడు

ప్రతిపక్షంలో తెలుగుదేశం పై పోరాడాను.

తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ నిన్ను కార్పొరేట్ చేసినది ఎవరు.నిన్ను ఎమ్మెల్యేని చేసింది ఎవరు.

ఆనం వివేకనంద రెడ్డి గారు కాదా.ఆనం కుటుంబం పై నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోయావా అనిల్.

నువ్వు మంత్రి అయిన రోజు ఎంత మంది ఎమ్మెల్యేలు నీతో వచ్చారు అనిల్.డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు నియోజకవర్గంలో ఉన్న అన్ని చర్చలు తిరిగి సేవా కార్యక్రమాలలో పాల్గొన్న.25వ తారీకు నేను చంద్రబాబు నాయుడుని ఎలా కలుస్తాను.నెలరోజుల ముందు దాకా నాకు ఎటువంటి ఆలోచన లేదు.

వైసిపి అధిష్టానం నన్ను అనుమానించిన తర్వాతే నిర్ణయం తీసుకున్న.అమెరికా అధ్యక్షుడుకే సలహాదారుడుగా ఉండే సామర్థ్యం ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి.

సినిమా హాల్లో రెండు లక్షలు వసూలు చేస్తున్నట్టు సజ్జల ఆడియో లీకులు చేస్తున్నారు.వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదా.

ఆడియో లీకులు చేసే దైర్యం ఉంటే సజ్జల.ఇసుక మాఫియా.

మద్యం మాఫియా.ఆడియో లీక్ చేసే ధైర్యం ఉందా.

మీరు వీటి మీద ఆడియో రిలీజ్ చేస్తే మీ సలహాదారుడు పోస్ట్ పోయే అవకాశం కూడా ఉంది.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అంటున్నారు.

జైలు చాలా అచ్చు వస్తాయి సార్.జార్జ్ ఫెర్నాడేస్ జైల్లో ఉండే బంపర్ మెజార్టీతో గెలిచాడు.

సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు లీకులు ఇవ్వడం ఎందుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు వందలాది మంది సోషల్ మీడియాలో పనిచేశారు.జైళ్లకు పోయారు దెబ్బలు తిన్నారు సర్వస్వం కోల్పోయారు.

వైసిపి ప్రభుత్వం రాగానే నీ కొడుకు సజ్జల భార్గవ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జి ఎలా అయ్యారు.రూరల్ నియోజకవర్గం ఇంచార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి శుభాభినందనలు.

రూరల్ నియోజకవర్గంలో నా శక్తి మేరకు పని చేశా.మీరు ఇన్చార్జిగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి.

ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube