ఆవు పేడను ఇండియాలో చాలా పనులకు వాడుతుంటారు.ఎందుకంటే ఆవు పేడలో ఉపయోగకరమైనవి ఎన్నో ఉంటాయి.
వాటితో ట్రాక్టర్ కూడా నడిపించవచ్చని తాజాగా ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక కంపెనీ నిరూపించింది.ఈ కంపెనీ ఆవుపేడతో నడిచే వరల్డ్ ఫస్ట్ ట్రాక్టర్‌ను తయారుచేసింది.
నిజానికి ఎప్పటినుంచో వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇది లేకుండా రైతులు పనులు పూర్తి చేయలేదంటే అతిశయోక్తి కాదు.
అయితే వీటి మెయింటెనెన్స్ ఖర్చులు మాత్రం రైతులకు భారంగా మారుతున్నాయి.ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ట్రాక్టర్లన్నీ డీజిల్ తో నడిచేవే.
కాగా డీజిల్ ధరలు మండిపోతున్న వేళ పంట వ్యయం పెరుగుతోంది.

ఈ ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో తొలిసారిగా బ్రిటిష్ కంపెనీ ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ తయారు చేసింది.న్యూ హాలండ్ కంపెనీ రూపొందించిన ఈ ట్రాక్టర్ లిక్విఫైడ్ మీథేన్‌తో రన్ అవుతుంది.

ఆవు పేడ నుంచి మీథేన్ ద్వారా ఇంధనాన్ని సులభంగా ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ చెబుతోంది.ఇలాంటి వాయువులను ఈ ట్రాక్టర్ ఉత్పత్తి చేయదు కాబట్టి ఎన్విరాన్‌మెంట్ పొల్యూషన్ ఏ మాత్రం పెరగదు.అలానే అన్నదాతలపై డీజిల్ ఖర్చుల భారం తగ్గుతుంది.
ఆవు పేడతో నడిచే ఈ ట్రాక్టర్ 270hp పవర్ తో సాధారణ ట్రాక్టర్ వలె చాలా శక్తివంతంగా పనిచేస్తుందట.పదేళ్ల కాలంగా బయోమీథేన్ ప్రొడక్షన్ పై రీసెర్చ్ చేస్తున్న బ్రిటిష్ కంపెనీ బెన్నమాన్ ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేసింది.
ఆవు పేడ నుంచి ఫ్యుజిటివ్ మీథేన్ తయారుచేసి దానిని ఈ ట్రాక్టర్ కోసం కంపెనీ వాడుతోంది.








