ఎలక్షన్స్ లో గెలిచింది ఓటరు మాత్రమే..చీల్చి చెండాడుతారు ..ఏ పార్టీ అయినా అంతే

2024 ఎలక్షన్స్( 2024 elections ) చాలా మందికి ఒక గుణపాఠం లాంటివి.

అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన తీరు, ప్రజలు ప్రతిసారి తాము వ్యవహరిస్తున్న విధానం చెంపపెట్టు లాగానే ఉంటుంది.

ఆ పార్టీ ఓడిపోయింది లేదా ఈ పార్టీ గెలిచింది అనేకన్నా కూడా ఖచ్చితంగా ఓటరు మాత్రమే గెలుస్తున్నాడు అని చెప్పాలి.ఎవరు గెలిచినా ఎవరు ఓడినా దాని పరిణామం ఓటరు వేసిన ఓటు వల్లే జరిగింది.

w అందుకే ఓటర్ గీసిన గీత దాటి బయటకు వెళ్లే పరిస్థితి రాజకీయ నాయకులకు లేకుండా పోతుంది.ఐదేళ్ల పాటు అవినీతి చేయండి ఎంతనైనా ఎన్ని కోట్లు అయినా దోచేసుకోండి.

కానీ ఆ ఐదో ఏడు వచ్చే ఎలక్షన్స్ కి సిద్ధం కండి అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ప్రజల ఓటు వేసే తీరు.

Advertisement

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ( Andhra Pradesh Elections )తీసుకుంటే 2014లో గెలిచినా కూడా 2019లో 23 సీట్లను చూసుకొని చంద్రబాబు నాయుడు కన్నీళ్ళ పర్యంతమయ్యాడు.నేను 23 సీట్లు మాత్రమే గెలిచేంత ద్రోహం ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశాను అని ఆయన అడిగాడు.అప్పుడు ఆయన చెప్పింది నిజమే అనిపించింది.

మరి అంత ద్రోహం ఏం చేశాడు అంటే ఓటరు ఎవరినైనా చీల్చి చెండాడుడుతారు.ఎంత అయోధ్య కఠినా కూడా అక్కడే బిజెపి ఊడిపోయింది అంటే ప్రజల మనసు ఎలా ఉంటుంది వారి ఓటు ఎలా పడుతుంది అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంచనా వేయడం చాలా కష్టమైన పని.ఒక్క సీటు కూడా గెలవలేనివి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కి 100% స్ట్రైక్ రేట్ ఇవ్వడం అంటే కూడా జీర్ణించుకోవడానికి చాలా కష్టం అసలు ఎలాంటి ప్రాధాన్యత లేని బీజేపీకి కూడా 10 సీట్స్ ఇస్తే అందులో ఎనిమిది గెలుచుకొచ్చారు.

దాంట్లో బిజెపికి .టిడిపి( TDP , BJP ) నే నేతలను ఇచ్చి మరీ దగ్గరుండి గెలిపించుకుంది అనే అపవాదు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా తేల్చేది నెంబర్ మాత్రమే.అందుకే ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ ఈ ఐదేళ్లపాటు ఎవరు ఎలా పరిపాలిస్తారు అనే దానిపైన వచ్చే ఎలక్షన్స్ లో వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

పోయిన.సారి జగన్ వచ్చాడు.దాన్ని ఎలాగు ఉపయోగించుకోలేక పోయాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

ఈసారి బాబు వస్తే మాత్రం అలాగే ఉంటాడు అని నమ్మకం లేదు ఏ మాత్రం తేడా కొట్టినా 2019 ఫలితం మళ్లీ వస్తుంది.సునామీ లాగా 11 నుంచి ఐదుకు పడిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు.

Advertisement

అంతిమంగా గెలిచేది రాజకీయ పార్టీలు కాదు ఓటరు.ఇది గుర్తుపెట్టుకుని రాజకీయాలు చేయాలి, పరిపాలన కొనసాగించాలి.

తాజా వార్తలు