సీఎం కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నారు.జాతీయ పార్టీ స్థాపించి బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కోరుకుంటున్నారు.
అయితే రాష్ట్రపతి ఎన్నికల కారణంగా అదికాస్తా వాయిదా పడిన విషయం తెలిసిందే.ప్రస్తుతానికికైతే రాష్ట్ర రాజకీయంపై ఫోకస్ పెట్టారు.
ఇక రాష్ట్రంలో బీజేపీ కూడా బలపడుతోంది.కేంద్రం నేతలు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
అలాగే కాంగ్రెస్ కూడా రేవంత్ నాయకత్వంలో దూకుడు పెంచింది.ఇప్పటికే చేరికలపై పలు నేతలతో టచ్ లో ఉన్నారు.
దీంతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్షాలన్ని పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి.
సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తమ బలాన్ని అంచనా వేసుకుంటున్నాయి.ఇక కేసీఆర్ కూడా తెలంగాణలో సర్వేల బాధ్యత పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఇక పీకే ఐప్యాక్ టీమ్ లు తెలంగాణలో పర్యటిస్తూ ప్రజల నాడి తెలుసుకుంటున్నాయి.ఎప్పటికప్పుడు కేసీఆర్ కు నివేదికలు ఇస్తున్నాయి.
పీకే టీమ్ నివేదికల ఆధారంగా పార్టీ నేతలను కూడా కేసీఆర్ అలర్ట్ చేస్తున్నారు.అయితే ఈ ఫలితాల్లో ఈ సారి గెలుపు అంత ఈజీ కాదని వెల్లడైనట్లు తెలుస్తోంది.
సర్వేల్లో ఎమ్మెల్యేలు, మంత్రులపై వ్యతిరేకత వస్తుండటంతో చాలా మంది ఈ సారి గెలవడం కష్టమే అంటున్నారు.హ్యాట్రిక్ ఆశలు నెరవేరేలా లేవని సర్వే ఫలితాలను చూస్తే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
టీఆర్ఎస్ కు పరిస్థితులు సానుకూలంగా లేవని అంటున్నారు.తొలిసారిగా అధికార పార్టీకి వ్యతిరేక సంకేతాలు వచ్చినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయని చెబుతున్నారు.
కారణం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు, బీజేపీ బలపడుతుండటం.కాంగ్రెస్ లో రేవంత్ నాయకత్వంలో జోరు పెంచడమే అంటున్నారు.
ఇక ఈ సారి ఎమ్మెల్యేలే కాకుండా కొంతమంది మంత్రులకూ తమ నియోజకవర్గాల్లో గట్టిపోటీ తప్పదని సర్వేల్లో తేలినట్లు సమాచారం.రాష్ట్రంలో కేసీఆర్ కాకుండా 16మంది మంత్రులున్నారు.
ఇద్దరు ఎమ్మెల్సీలు కాగా 14 మంది ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవిలు దక్కించుకున్నారు.అయితే చాలా మంది వ్యతిరేకత మూటగట్టుకున్నారని.
మరికొంత మందికి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ తప్పదంటున్నారు.

ఇక ఉత్తర తెలంగాణలో ఓ మంత్రి ఈసారి గెలవడం కష్టమేనంటున్నారు.ప్రజలకు దూరంగా ఉంటూ వ్యతిరేకత కొనితెచ్చుకున్నాడట.అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గతంలో కేవలం 200 లోపు ఓట్లతోనే విజయం సాధించారు.ఈయనకు కూడా గెలుపునకు పరిస్థితులు అనుకూలంగా లేవని అంటున్నారు.
అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రుల పరిస్థితి కష్టమేనంటున్నారు.పార్టీ నేతలే వీరిపై ఆరోపణలు చేస్తూ విజయానికి అడ్డుపడుతున్నారనేది వాస్తవం.
ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ నెగ్గె సూచనలు ఉన్నాయని అంటున్నారు.అలాగే ఖమ్మంలో మంత్రి పరిస్థితి ఇలాగే ఉందని.
అంతేకాకుండా పార్టీ మారే చాన్స్ కూడా ఉందంటున్నారు.ఇక కేసీఆర్ ఇలాక గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల పోటీకి దిగితే గట్టి పోటీ ఖాయమంటున్నారు.
అలాగే సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీష్ కు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయిని చెబుతున్నారు.అయితే కరీంనగర్ లో మరో మంత్రికి అనుకూలంగా లేదని అక్కడ బీజీపీ నేత పాగా వేస్తారని అంటున్నారు.
ఇలా కొంత మంది మినహాయిస్తే చాలా మందికి ఈ సారి గెలుపు కష్టమనే అంటున్నారు.మరి దీనిపై గులాబీ బాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.