శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ప్రకటించారు.
తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ రోజుకు 15 నుంచి 20 వేల మంది భక్తులకు మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని వివరించారు.
మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని చైర్మన్ వివరించారు.ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే కార్యక్రమం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయిందని త్వరలోనే ఈ సమస్యను అధిగమించి ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని చెప్పారు.
అలాగే వెంకటేశ్వరస్వామి భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు స్వామిని కీర్తిస్తూ రాసిన కీర్తనలకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రచారం కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి చెప్పారు.తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఆయన ఇందుకు సంబంధించిన ప్రోమోలను విడుదల చేశారు.చైర్మన్ మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనలకు బహుళ ప్రాచుర్యం కల్పించేందుకు ‘అదివో అల్లదివో ‘ పేరుతో తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లోని యువతకు పోటీలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
తొలత జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో యువతకు పోటీలు నిర్వహిస్తామని వివరించారు.టీటీడీ రికార్డ్ చేసిన నాలుగు వేల సంకీర్తనలు నుంచే ఈ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇందులో భాగంగా మొదట చిత్తూరు జిల్లాకు చెందిన 15 నుంచి 25 సంవత్సరాల వయసు గాయనీగాయకులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.శుక్రవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆసక్తి కలిగిన గాయనీగాయకులు నుంచి ఎస్వీబీసీ వెబ్ సైట్ లోనూ నేరుగా దరఖాస్తు స్వీకరిస్తారని పేర్కొన్నారు.దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 25 26 తేదీల్లో ఎస్వీబీసీ కార్యాలయంలో నిర్వహిస్తారని తెలిపారు నేరుగా రాలేను గారికి 27వ తేదీ ఉదయం 10 నుంచి 6 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా సెలక్షన్స్ జరుగుతాయన్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానల్ ప్రారంభమవుతాయని, ఈ చానళ్లు ద్వారా కూడా పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.