నెలసరి సమయంలో ఖచ్చితంగా తాగాల్సిన టీ ఇది.. ఎందుకో తెలుసా?

సాధారణంగా చాలా మంది మహిళలకు నెలసరి అనేది ఎంతో బాధాకరంగా సాగుతుంది.నడుము నొప్పి, కడుపు నొప్పి, కాళ్లు లాగడం వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.

వీటికి తోడు అధిక రక్తస్రావం, కళ్ళు తిరగడం, నీరసం, తిమ్మిర్లు ఇలా ఎన్నో సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.అయితే వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఆ సమయంలో కొన్ని ఆహారాలు ఎంతో బాగా సహాయపడుతుంటాయి.

అటువంటి వాటిలో మందారం టీ కూడా ఒకటి.నెలసరి సమయంలో కచ్చితంగా తాగాల్సిన టీ ఇది.మందారం టీ అంటే పెద్దగా కష్టపడి పోవాల్సిన అవసరం ఏమీ లేదు.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు మందారం పొడి రేకులు వేసి రెండు గంటలు నానబెట్టాలి.ఆ తర్వాత ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు వాట‌ర్ ను మరిగిస్తే కలర్ మారుతుంది.

Advertisement

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టీ ని ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ మందారం టీ లో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, చిటికెడు దాల్చిన చెక్క( Cinnamon ) పొడి కలిపి సేవించాలి.ఈ మందారం టీ టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ కు ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా నెలసరి నాలుగు రోజులు మందారం టీ ని తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి.

మందారం టీ అనేది న్యాచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది.ఆ సమయంలో కడుపునొప్పి, నడుము నొప్పి ఇలా ఎలాంటి నొప్పులు ఉన్నాస‌రే మందారం టీ తాగితే తగ్గు ముఖం పడతాయి.

అలాగే మందార టీ( Hibiscus tea ) మూడ్ ను ఉత్సాహంగా మారుస్తుంది.నీరసం, అలసట, చిరాకు వంటి వాటిని దూరం చేస్తుంది.ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

ఒకవేళ మందారం టీ ను రోజు కనుక తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

Advertisement

కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.వెయిట్ లాస్ అవుతారు.

మందారం టీ లో విటమిన్ సి రిచ్ గా ఉంటుంది.కాబట్టి మందారం టీ ను డైట్ లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ౠస్ట్ అవుతుంది.

చర్మం నిగారింపుగా సైతం మెరుస్తుంది.

తాజా వార్తలు