ఈ సూప‌ర్ `టీ`ని తీసుకుంటే బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు మేధాశక్తి కూడా పెరుగుతుంది!

ఉద‌యం పూట టీ తాగే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.టీ తోనే డేను స్టార్ట్ చేసేవారు ఎంద‌రో ఉన్నారు.

టీ అనేది కోట్లాది మంది లైఫ్ స్టైల్ లో ఒక భాగం అయిపోయింది.అయితే మిల్క్‌, షుగ‌ర్ తో త‌యారు చేసిన టీల కంటే హెర్బ‌ల్ టీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అటువంటి వాటిలో ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ టీ కూడా ఒక‌టి.ఈ టీని తీసుకుంటే బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు మేధాశక్తి రెట్టింపు అవుతుంది.

అలాగే మ‌రెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ల‌భిస్తాయి.మ‌రి ఇంత‌కీ ఈ హెర్బ‌ల్ టీని ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో నాలుగు నుంచి ఆరు మందారం పువ్వుల రేకులు, గుప్పెడు వాట‌ర్ లో క‌డిగిన మ‌న‌గాకు, అర అంగుళం పొట్టు తొల‌గి దంచిన అల్లం ముక్క, పావు స్పూన్ మిరియాల పొడి వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు చిన్న మంట‌పై బాగా మ‌రిగించాలి.

ఇలా మ‌రిగించిన మందారం-మ‌న‌గాకు టీను స్ట్రైన‌ర్ సాయంతో ఫిల్ట‌ర్ చేసుకుని.అందులో వ‌న్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసుకుని తాగేయ‌డ‌మే.

ఈ సూప‌ర్ హెల్తీ హెర్బ‌ల్ టీను ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఒక క‌ప్పు చ‌ప్పున‌ తీసుకుంటే బాడీలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది.వెయిట్ లాస్ అవుతారు.

మేధాశక్తి రెట్టింపు అవుతుంది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

అంతేకాదండోయ్‌.రోజు ఉద‌యాన్నే పైన చెప్పిన హెర్బ‌ల్ టీ ను తీసుకుంటే వ్య‌ర్థాలు, విషాలు తొల‌గిపోయి బాడీ డిటాక్స్ అవుతుంది.మార్నింగ్ సిక్ నెస్ దూరం అవుతుంది.

Advertisement

గ్యాస్‌, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.అలాగే ఈ టీలో యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు వ్యాధినిరోధకతను పెంచడానికి కూడా గ్రేట్ గా స‌హాయడ‌తాయి.

కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ టీను డైట్‌లో చేర్చుకోండి.

తాజా వార్తలు