అతి ఆకలితో అధికంగా తింటున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!

సాధారణంగా కొందరిలో ఆకలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హెవీగా తిన్నా కూడా మళ్లీ కాసేపటికే ఆకలి వేస్తుంటుంది.

అతి ఆకలి ( Extreme hunger )అనేది పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు.కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనది.

అతి ఆకలి వల్ల అధికంగా తింటూ ఉంటారు.దాంతో శరీర బరువు అదుపు త‌ప్పుతుంది.

బరువు పెరగడం వల్ల మధుమేహం, గుండెపోటు, రక్తపోటు( Diabetes, Heart attack ).ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో జబ్బులు చుట్టు ముట్టడానికి రెడీగా కూర్చుంటాయి.కాబట్టి వీటన్నిటికీ మూల కారణమైన అతి ఆకలిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వాస్తవానికి కొన్ని కొన్ని ఆహారాలు అతి ఆకలిని అద్భుతంగా అణచివేస్తాయి.ఇప్పుడు చెప్పబోయే స్మూతీ కూడా ఆ కోవకే చెందుతుంది.ముందుగా ఒక కప్పు నువ్వులను రెండు గంటల పాటు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి పాలు తీయాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో అర కప్పు యాపిల్ ముక్కలు, అర కప్పు అరటిపండు ముక్కలు వేసుకోవాలి.అలాగే ఒక స్పూన్ గుమ్మడి గింజలు, ఒక స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు, ఒక స్పూన్ ఎండు ద్రాక్ష, ఒక స్పూన్ వేయించి పొట్టు తొలగించిన పల్లీలు మరియు ఒక గ్లాసు ఫ్రెష్ నువ్వుల పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మన యాపిల్ బ‌నానా స్మూతీ( Apple Banana Smoothie ) అనేది సిద్ధం అవుతుంది.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని తీసుకుంటే బోలెడు లాభాలు పొందుతారు.ముఖ్యంగా ఈ స్మూతీ అతి ఆకలిని అణచివేస్తుంది.కడుపుని ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతుంది.

నా ఇంట్లో నాగవంశీ ఫోటో పెట్టుకుంటాను.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్!
ఆ రెండు శాఖలపై చంద్రబాబు ఫోకస్ .. నేడు సమీక్ష

ఆహార కోరికలను తగ్గిస్తుంది.రోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉండేందుకు కూడా ఈ స్మూతీ తోడ్పడుతుంది.

Advertisement

పైగా ఎముకలను బలోపేతం చేయడానికి, జుట్టు రాలటాన్ని అడ్డుకోవడానికి, చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మెరిపించ‌డానికి, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి కూడా ఈ స్మూతీ ఉత్త‌మంగా సహాయపడుతుంది.

తాజా వార్తలు