Pawan Kalyan , Anna Lezhenova : అచ్చం తెలుగింటి ఆడపడుచులా ఉన్న పవన్ కళ్యాణ్ భార్య.. ఆ ఫోటోతో ఫిదా చేశారుగా!

మెగా బ్రదర్ నాగబాబు కొనిదెల కుమారుడు మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల వివాహం తాజాగా నవంబర్ 1న ఇటలీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ కి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.దాదాపు ఆరేళ్లుగా సీక్రెట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఆ విషయాన్ని బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లు ఎట్టకేలకు ఈ కుటుంబ సభ్యుల అంగీకారంతో మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు.

ఇక ప్రస్తుతం లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ( Lavanya Tripathi, Varun Tej )ల ఫోటోలతో పాటు మెగా హీరోలు అందరి ఫోటోలు, మెగా ఫ్యామిలి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.ఇక వాటిలోనే మెగా బ్రదర్స్, అక్క చెల్లెల్లు అందరూ ఒక గ్రూపులో ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.కాగా ఆ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి - సురేఖ, నాగబాబు-పద్మజ, పవన్ కళ్యాణ్ -అన్నా లెజెనోవా( Pawan Kalyan - Anna Lezhenova ), అలాగే వారి సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి వారి భర్తలతో ఉన్న గ్రూపు ఫోటో వైరల్ అవుతోంది.

ఇది చాలా రేర్ ఫోటో అని అంటున్నారు మెగా ఫ్యాన్స్.ఎందుకంటే అందరూ ఇలా కలుసుకునేది ఏదైనా ఒక ఫంక్షన్ లోనే కదా, ఈసారి అందరూ వరుణ్ తేజ్ పెళ్ళికి కలవటం, ఇలా ఫోటోకి పోజులివ్వటం బాగుందంటూ మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇక ఇందులో హైలెట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవా అయితే అచ్చం తెలుగింటి ఆడపడుచులా చీరలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.అలాగే పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజెనోవాతో విడిపోయారు అంటూ కూడా ఆ మధ్య వార్తలు వినిపించాయి.ఈ ఫోటో ఆ వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.

ఆ ఫోటోని మెగా అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు