ఈ కొత్త గేమ్ నిద్రను ట్రాక్ చేస్తుంది... నిద్రపోయినవారికి రివార్డ్స్!

పోకేమాన్‌‘ గురించి జనాలకి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.జపనీస్ మీడియా ఫ్రాంచైజీని రన్ చేసే పోకేమాన్‌ కంపెనీ పాపులర్ గేమ్‌లతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించింది.తాజాగా ఈ కంపెనీ ప్రకటించిన ఒక కొత్త మొబైల్ గేమ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.“పోకేమాన్‌ స్లీప్” పేరిట మార్కెట్లకి వచ్చిన ఈ కొత్త మొబైల్ గేమ్‌లో భాగంగా ప్లేయర్లు నిద్ర పోవలసి ఉంటుంది.అలా నిద్రపోతే వారికి రివార్డులను అందజేస్తుంది.వినడానికి వింతగా అనిపిస్తున్నా ఇది నిజమే.ఇక్కడ ప్లేయర్ నిద్రిస్తున్న గంటల సంఖ్యకు బదులుగా ఈ గేమ్ రివార్డ్‌ను అందజేస్తుంది.

 This New Game Tracks Sleep Rewards For Sleepers Pokemon, New Game ,tracks Sleep,-TeluguStop.com

కాగా ఈ గేమ్ ఇతర పోకేమాన్‌ గేమ్‌లకు పూర్తి భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇతర పోకేమాన్‌ గేమ్‌లలో, ప్లేయర్లు చాలా సమయం పాటు పోకేమాన్‌ను పట్టుకోవడానికి చూస్తారు.వారు తమ సొంత పోకేమాన్‌ను లెవెల్ అప్ చేయడానికి కూడా ఇతర పోకేమాన్‌లతో పోరాడాల్సి ఉంటుంది.

అయితే, పోకేమాన్‌ స్లీప్‌లో ప్లేయర్లు ఏ పనీ చేయాల్సిన అవసరం లేదు.వారు నిర్దిష్ట సమయంలో పడుకోవడం ద్వారా అరుదైన పోకేమాన్‌ను పట్టుకోవచ్చు.

ఇకపోతే ఈ కొత్త రకం గేమ్‌ను 2019లోనే ప్రకటించినప్పటికీ 2023 వరకు ఎలాంటి అప్‌డేట్‌లు రాకపోవడం కొసమెరుపు.చివరగా ఫిబ్రవరి 27న, కంపెనీ గేమ్ కోసం ట్రైలర్‌ను విడుదల చేసింది.ఈ టైలర్ చూసిన పోకేమాన్ లవర్స్ చాలా ఎంజాయ్ చేసారు.హాయిగా నిద్రపోవడం ద్వారా పోకేమాన్ గెలుచుకోవడానికి ఉత్సాహపడుతున్నారు.గేమ్ నిద్ర సమయాన్ని డోజింగ్, స్నూజింగ్, స్లంబరింగ్ అనే 3 కేటగిరీలలో విభజిస్తుంది.ప్రతి కేటగిరీని అన్‌లాక్ చేయడం ద్వారా ప్లేయర్ ఆకర్షించే పోకేమాన్‌ రకం డిసైడ్ అవుతుంది.

గేమ్‌లో ప్రొఫెసర్ నెరోలి స్నోర్లాక్స్ నివసించే ఒక విచిత్రమైన ద్వీపంలో పోకేమాన్‌ నిద్రపై పరిశోధన చేస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube