ఈ న్యాచుర‌ల్ మాస్క్‌తో స్కిన్ టోన్‌ను సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..తెలుసా?

స్కిన్ టోన్ పెంచుకునేందుకు కొంద‌రు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే క్రీములు, మాస్క్‌లు, లోష‌న్లు.ఇలా ఎన్నో వాడుతుంటారు.

కొంద‌రు బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లి ఎన్నెన్నో ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.ఈ క్ర‌మంలోనే వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.

అయితే ఎటు వంటి ఖ‌ర్చు లేకుండా ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ అండ్ న్యాచుర‌ల్ మాస్క్‌ను వాడితే చాలా సుల‌భంగా స్కిన్ టోన్‌ను పెంచుకోవ‌చ్చు.మ‌రి ఆ న్యాచుర‌ల్ మాస్క్‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఫ్రెష్‌గా ఉండే ఒక క‌ట్ట కొత్తిమీర తీసుకుని వాట‌ర్‌లో క‌డిగిన త‌ర్వాత‌ మెత్త‌గా నూరి ర‌సం తీసుకుని పెట్టుకోవాలి.

అలాగే ఒక బంగాళ‌దుంప‌, ఒక కీరా దోస‌ను తీసుకుని.వాటిని కూడా విడి విడిగా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఒక‌ గిన్నె తీసుకుని అందులో అర క‌ప్పు చ‌ప్పున కొత్తి మీర ర‌సం, బంగాళ దుంప ర‌సం, కీరా ర‌సం మ‌రియు రెండు స్పూన్ల మొక్క జొన్న పిండి వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి.

Advertisement

ఆ త‌ర్వాత స్ట‌వ్‌పై పెట్టి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు హిట్ చేసుకుని దింపేయాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని స్పూన్‌తో బాగా తిప్పుకుంటూ చ‌ల్లార బెట్టి.ఆపై అందులో రెండు విట‌మిన్ ఇ క్యాప్సుల్స్ ఆయిల్‌ను మిక్స్ చేసుకుంటే మాస్క్ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ మిశ్ర‌మాన్ని ఫ్రీజ్‌లో పెట్టుకుంటే గ‌నుక‌.ప‌ది రోజుల పాటు నిల్వ ఉంటుంది.

ఇక ఈ న్యాచుర‌ల్ మాస్క్‌ను ఎలా వాడాలంటే ముందుగా ఫేస్‌ను వాట‌ర్‌తో శుభ్ర ప‌రుచుకోవాలి.ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న మాస్క్‌ను డైరెక్ట్‌గా అప్లై చేసి.

ఇర‌వై నిమిషాల అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే స్కిన్ టోన్ అద్భుతంగా పెరుగుతుంది.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

అలాగే ఈ మాస్క్‌ను ఫేస్‌కే కాదు.స్కిన్ మొత్తానికి వాడొచ్చు.

Advertisement

తాజా వార్తలు