ముడ‌త‌ల‌ను మాయం చేసి ముఖాన్ని య‌వ్వంగా మెరిపించే మ్యాజిక‌ల్ ఆయిల్ మీకోసం!

ఇటీవల రోజుల్లో చాలా మంది ముప్పై ఏళ్లకే ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు.అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు.

కానీ ముడతలు ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.అలాగే ముసలి వారిగా చూపిస్తాయి.

ఈ క్రమంలోనే ముడతలు నివారించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.కొందరైతే ఏవో ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాజిక‌ల్ ఆయిల్‌ను వాడితే ముడతలు మాయం అవ్వడమే కాదు ముఖం యవ్వనంగా సైతం మెరుస్తుంది.మరి ఇంతకీ ఆ ఆయిల్ ఏంటి.? దాని ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఆల‌స్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఆరు నుంచి ఎనిమిది బిర్యానీ ఆకులు, ఐదు అనాస పువ్వులు వేసి లైట్ గా వేయించుకోవాలి.

Advertisement
This Magical Oil Helps To Reduce Wrinkles And Makes The Face Look Younger , Wrin

ఇలా వేయించుకున్న బిర్యానీ ఆకులు మరియు అనాస పువ్వులు మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి.ఆ తర్వాత ఈ పొడిని ఒక గ్లాస్ జార్లో వేసుకోవాలి.

అలాగే అందులో ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ గ్లాస్ జార్‌ను మరుగుతున్న నీటిలో క‌నీసం ప‌దిహేను నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.

ఆపై పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.

This Magical Oil Helps To Reduce Wrinkles And Makes The Face Look Younger , Wrin

ఈ ఆయిల్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మడతలను నివారించే మ్యాజికల్ ఆయిల్ సిద్ధం అవుతుంది.ఈ ఆయిల్‌ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ప్రతిరోజు ఈ విధంగా చేస్తే ముడతలు క్రమంగా మాయం అవుతాయి.మరియు ముఖ చర్మం మృదువుగా యవ్వనంగా మారుతుంది.చర్మంపై ఏమైనా మచ్చలు ఉన్న దూరం అవుతాయి.

Advertisement

తాజా వార్తలు