శిల్ప శెట్టి.నిత్యం వివాదాల్లో ఉండే హీరోయిన్.ఆమె చుట్టూ వివాదాలు లేకపోతే ఆశ్చర్యపోవాలి.కెరీర్ మొదలు పెట్టిన రోజు నుంచి నేటి వరకు ఆమనీ నిత్యం వివాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి.ఇలాంటి వివాదాలు రావడానికి ఒక్కోసారి ఆమె ప్రవర్తన కారణం అయితే ఒక్కోసారి పక్కవారి అతి కారణం అవుతుంది.అయితే ఇప్పుడు మనం చూడబోయే సంఘటన మాత్రం వివాదం అనడం కంటే క్రైమ్ అనడం బెటర్.
ఎందుకంటే శిల్ప శెట్టి ఏకంగా ఒక డాన్ కి సంబందించిన విషయంలో వేలు పెట్టడమే.ఇంతకు ఆ డాన్ ఎవరు ? జరిగిన క్రైమ్ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శిల్ప శెట్టి తల్లి సునంద శెట్టి కి గుజరాత్ లోని సూరత్‌కు చెందిన ప్రఫుల్ శారీస్ యజమాని శివనారాయణ్ అగర్వాల్‌తో ఎన్నో రోజుల నుంచి వివాదం నడుస్తుంది.ఈ సంఘటన 2003 లో జరిగింది.
అయితే వివాదం ఇంతకు సర్దు మనగకపోవడం తో ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి బ్యాంకాక్‌కు చెందిన డాన్ ఫజలుర్-రెహమాన్‌ను సునంద హైర్ చేసుకోవడం విశేషం.ఈ ఘటన జరగడానికి ఐదేళ్ల క్రితం అగర్వాల్ తన చీరలను మోడలింగ్ చేయడం కోసం శిల్పాకు రూ.4 లక్షలు చెల్లించాడు.అయితే ఒప్పందం కుదుర్చుకున్న రోజు ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోకపోవడం తో ఆ తర్వాత సైతం మోడలింగ్ కోసం శిల్ప ను ఉపయోగించుకోవాలని ఒత్తిడి చేసాడు.

అయితే అందుకోసం డబ్బులు ఇవ్వాలని శెట్టి కోరడంతో అందుకు అతడు నిరాకరించాడు.దాంతో ఈ ఇష్యూ ని సెటిల్ చేయడానికి అండర్ వరల్డ్ డాన్ తో ఒప్పందం చేసుకున్నారు. అయితే శివ నారాయణ్ కి సదరు డాన్ అనుచరుల నుంచి అలాగే శిల్ప శెట్టి పేరెంట్స్ కి తరుచుగా ఫోన్ కాల్స్ రావడం తో పోలీసుల ట్యాపింగ్ లో ఈ విషయం బయటపడింది.అయితే శెట్టి పేరెంట్స్ తో అగర్వాల్ ఒప్పందం కుదుర్చుని సెటిల్ మెంట్ అయినా తర్వాత డబ్బులు చెల్లిస్తున్న టైం లో పోలీసులు ఎంట్రీ ఇవ్వడం తో కథ మొత్తం అడ్డం తిరిగింది.
అయితే ఈ విషయంలో శిల్ప శెట్టి తండ్రి ఇన్నోసెంట్ అంటూ బెయిల్ పొందిన ఆ తర్వాత ఈ కేసు ఏమైంది అనేది మాత్రం గోప్యంగా ఉంచబడింది.







