ట్రూ లవ్ అంటే ఇదే.. ముసలి వయసులో పెళ్లి చేసుకున్న వృద్ధ ప్రేమికులు..!

నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదని తాజాగా ఒక జంట నిరూపించింది.ఎంత సమయం పట్టినా ప్రేమికులు ఒకరికొకరు తిరిగి కలుసుకుంటారని ఈ జంట రుజువు చేసింది.

ప్రేమ శక్తి అన్ని సవాళ్లను అధిగమించగలదని విశ్వసించే ప్రతి ఒక్కరికీ ఈ జంట ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది.ప్రేమ చాలా సవాళ్లను కూడా తట్టుకుని చివరికి విజయం సాధిస్తుందని లెన్, జీనెట్ ప్రేమికుల రియల్ స్టోరీ తెలుపుతోంది.

వివరాల్లోకి వెళితే.లెన్ ఆల్‌బ్రైటన్, జీనెట్ స్టీర్( Jeanette Steer ) మొదటిసారిగా 1963లో ఐల్ ఆఫ్ వైట్‌లో ట్రైనీ నర్సులుగా ఉన్నప్పుడు కలుసుకున్నారు.

వారు ప్రేమలో పడ్డారు.వివాహం చేసుకుని ఆస్ట్రేలియాకు వెళ్లాలని అనుకున్నారు, కానీ జీనెట్ తల్లిదండ్రులు లెన్‌తో పెళ్లిని నిరాకరించారు.

Advertisement

ఎందుకంటే ఆ సమయంలో వారు చట్టబద్ధంగా వివాహం చేసుకోవడానికి చాలా చిన్న వయస్సులో ఉన్నారు.లెన్ ఆస్ట్రేలియాకు( Len to Australia ) వెళ్లి, భూమిని కొనుగోలు చేసి, అక్కడ జీనెట్ తో కలిసి జీవించాలని ఆశించాడు.

కానీ వారు మళ్లీ ఒకరినొకరు కలవలేదు.

2015లో లెన్ వివాహం ముగిసింది.ఆపై అతను జీనెట్ అతనిని గుర్తుంచుకుంది లేదో తెలుసుకోవడానికి ఆమె చిరునామాను వెతకాలని నిర్ణయించుకున్నాడు.అతను ఆమెను కనుగొన్నాడు, కానీ ఆమె మొదట అతనిని గుర్తించలేదు.

ఆమె అప్పటికీ తన మొదటి భర్తతో వివాహం బంధాన్ని కొనసాగించింది.రెండు సంవత్సరాల తరువాత, జీనెట్ భర్త క్యాన్సర్‌తో మరణించాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తరువాత అతను ఆమెకు పంపిన క్రిస్మస్ కార్డు నుంచి ఆమె లెన్ చిరునామాను కనుగొంది.వారు డేటింగ్ ప్రారంభించారు.

Advertisement

కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత చివరకు 2023 లో పెళ్లి చేసుకున్నారు.

ఒకరికొకరు తిరిగి కలుసుకోవడానికి దశాబ్దాలు పట్టినప్పటికీ, ప్రేమ అడ్డంకులను అధిగమించగలదని వారి ప్రేమ కథ చూపిస్తుంది.లెన్, జీనెట్‌ల ప్రేమ 60 సంవత్సరాలకు పైగా విడిపోయినప్పటికీ వారి ప్రేమ మాత్రం బలంగానే ఉంది.ఇది లవ్ స్టోరీ మ్యారేజ్ తెలుసుకున్న చాలామంది ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు.

తాజా వార్తలు