విజయ్ దేవరకొండ హీరోగా చాలా మంచి సినిమాలు చేసాడు అందులో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి,గీత గోవిందం లాంటి సినిమాలు వచ్చాయి.అలాగే గౌతమ్ తిన్ననూరి (Gautam Tinnanuri)కూడా ఒక మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఎందుకంటే ఆయన తీసిన రెండు సినిమాలని గమనిస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది.
సుమంత్ (Sumanth)హీరోగా మళ్లి రావా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ సినిమా తరువాత నాని హీరోగా ఆయన చేసిన జర్సీ సినిమా కుడా మంచి విజయాన్ని అందుకుంది దాంతో ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ఒక సినిమా చేస్తున్నాడు…అయితే ఈ మధ్య ఒక న్యూస్ నెట్లో తెగ వైరల్ అవుతుంది అదేంటంటే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్నా స్టోరీ లీక్ అయింది అంటూ చాలా వార్తలు వస్తున్నాయి.వాటిని బట్టి తెలుస్తున్న స్టోరీ ఏంటంటే.

ఒక వ్యక్తి జరిగిన అన్యాయాన్ని ఎదురించే పాత్రలో విజయ్ కనిపించబోతున్నారు అనే సమాచారం అందుతుంది.దింట్లో విజయ్ ఒక సిన్సీయర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.అయితే దింట్లో చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కూడా ఉండబోతున్నాయట మొత్తానికి విజయ్ ని ఒక పవర్ ఫుల్ పోలీస్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు గౌతమ్… నిజానికి అయితే ఈ సినిమా రామ్ చరణ్ చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు దాంతో ఈ ప్రాజెక్ట్ లోకి విజయ్ దేవరకొండ వచ్చారు…ఈ సినిమా సక్సెస్ కొట్టాలని గౌతమ్ చాలా కసి తో ఉన్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే ఆయన చాలా అంచనాలను పెట్టుకొని హిందీ లో తీసిన జర్సీ సినిమా ప్లాప్ అయింది.
అందుకే ఆయన ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు అలాగే ప్రస్తుతం విజయ్ కూడా ప్లాప్ ల్లో ఉన్నాడు.ఈయనకి కూడా ఒక భారీ హిట్ కావాలని చూస్తున్నాడు అందుకే ఈ సినిమా హిట్ అవ్వడం విజయ్ కి కూడా చాలా కీలకం అనే చెప్పాలి…
.







