జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు.మూడు నెలల తరువాత పవన్ బయటకు వచ్చి హడావుడి చేస్తున్నాడని తెలిపారు.
బీసీలకు రాజ్యాధికారం అంటే చంద్రబాబుకి పల్లకీ మోయడమేనా అని మంత్రి ప్రశ్నించారు.పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నారు.2014 నుంచి పవన్ చంద్రబాబుతో కలిసే ఉన్నాడని చెప్పారు.అటు కాపు సేవా సమితి పేరుతో హరిరామ జోగయ్య హడావుడి చేస్తున్నారని విమర్శించారు.
ఈ క్రమంలో కాపు సేవా సమితిని కమ్మ సేనా సమితిగా మార్చుకుంటే మంచిదని సూచించారు.చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ నే పవన్ చదువుతాడని తెలిపారు.రానున్న ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలిచి తీరుతామని మంత్రి దాడిశెట్టి ధీమా వ్యక్తం చేశారు.







