టెస్లా, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్, తన ప్రియురాలతో ఉన్న మూడేళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలికారు.ఎలన్ మస్క్ తన ప్రియురాలికి బ్రేకప్ చెప్పినట్లు ‘పేజ్ సిక్స్’ కి వెల్లడించారు.
ఎలన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ పేరు గ్రిమ్స్ (33).ఆమె ప్రముఖ కెనడియన్ గాయకురాలుగా పేరు తెచ్చుకుంది.2018 నుంచి తనకంటే వయసులో 17 ఏళ్ల పెద్దవాడైన ఎలన్ మస్క్ (50)తో ప్రేమాయణం నడుపుతోంది.వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఎక్స్ఆయ్ఎయ్ (X A-Xii) అనే ఓ మగ బిడ్డ ఓ యేడాది క్రితం జన్మించాడు.
విడిపోతున్నట్లు ప్రకటించిన మస్క్ అందుకు గల కారణాలు ఏంటో వివరించారు.“మేము రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చామే కానీ విడిపోవడం లేదు.మేము స్నేహపూర్వక బంధాన్ని కొనసాగిస్తాం.స్నేహితుల్లా అప్పుడప్పుడు కలుసుకుంటాం.విడిపోవడానికి ప్రధాన కారణం.మాకున్న పని కట్టుబాట్లు, షెడ్యూల్‌లు సరిపోలడం లేదు.
బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అసలు కుదరడం లేదు” అని చెప్పారు.గ్రిమ్స్, అసలు పేరు క్లైర్ బౌచర్.ఆమె ట్విట్టర్‌లో టెస్లా సీఈఓ మస్క్ తో పరిచయం పెంచుకున్నారు.2018లో మెట్ గాలాకు హాజరైన వీరిద్దరూ తమ రొమాంటిక్ రిలేషన్ షిప్ గురించి అధికారికంగా ప్రకటించారు.ఈ ఏడాది సెప్టెంబర్ నెల ప్రారంభంలో న్యూయార్క్ లోని మెట్ గాలాలో చివరిసారిగా కనిపించారు.కానీ గ్రిమ్స్ ఒంటరిగా రెడ్ కార్పెట్ మీద నడుస్తూ పలు అనుమానాలకు దారి తీసింది.
ఆ తర్వాత సరిగ్గా నెల రోజుల్లోనే ఆ అనుమానాలు నిజమయ్యాయి.