మన ఇంటిలో మనతోపాటు నిత్యం ఉండేది గ్యాస్ సిలెండర్ అని చెప్పుకోవాలి.ఎందుకంటే మారుతున్న దైనందిత జీవితంలో గత పదేళ్ళ నుంచి గ్యాస్ సిలెండర్ ల వాడకం అనేది క్రమంగా పెరుగుతోంది.
చిన్న – పెద్ద, పేద – ధనిక అనే తేడాలేకుండా అందరూ ఇపుడు గ్యాస్ స్టవ్ ని ఉపయోగిస్తున్నారు.ఇక గ్యాస్ సిలెండర్ లను ఈ మధ్య కాలంలో వాడటానికి ఆసక్తి ఎక్కువ చూపించడంతో… ప్రభుత్వాలు కూడా సబ్సిడీ పేరుతో ప్రోత్సహిస్తున్నాయి.
అందువలనే గ్రామాల్లో గతంలో మాదిరిగా పుల్లల పొయ్యి మీద వంటలు అనేవి దాదాపుగా కనుమరుగయ్యాయి.అవగాహన పెరగడంతో పల్లె మహిళలు సైతం వాటిని ఉపయోగించేందుకు మక్కువ చూపుతున్నారు.
ఈ క్రమంలో గ్యాస్ సిలెండర్ విషయంలో చాలా మందికి ఓ అనుమానం వెంటాడుతుంది.అదే గ్యాస్ సిలెండర్ ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటా అని? దానికి కారణం ఏమిటో ఇపుడు తెలుసుకుందాం.బేసిగ్గా ఎరుపు రంగు అనేది ప్రమాదానికి సంకేతం అని చెపుతూ వుంటారు.ఈ రంగుని ఎప్పుడూ కూడా ప్రమాదకరమైన వస్తువులు లేదా వేడి వస్తువులపైన రంగుగా వాడతారు.
సిలిండర్లు మంటను దాచుకుంటాయి కనుక అవి ప్రమాధకమే కాబట్టి, ఎరుపు రంగులో గ్యాస్ సిలెండర్ కు పెయింట్ వేస్తారు.

అలాగే ఎరుపు రంగుని గుర్తించడం చాలా ఈజీగా ఉంటుంది.శాస్త్రీయంగా, కూడా ఎరుపు రంగు మిగతా రంగులకంటే కూడా డామినేషన్ ని కలిగి ఉంటుంది.అలాగే ఎరుపు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.
అందుకే దూరం నుండి కూడా ఈ రంగుని గుర్తించడం చాలా ఈజీ.అందుకే ఎరుపు రంగును ప్రమాదకరమైన వస్తువులకు వాడతారు.రోడ్లపై ఉండే సిగ్నల్ లైట్స్ కు కూడా ఇదే వర్తిస్తుంది.అయితే వాణిజ్య అలాగే పారిశ్రామిక సంస్థలలో ఉపయోగించే సిలిండర్లు మాత్రం నీలం రంగులోనే ఉంటాయి.అయినా వాటికి సిగ్నల్ ఇచ్చేది మాత్రం రెడ్ బ్యాండ్ కలిగి ఉంటుంది.







