తెలుగు సినీ పేక్షకులకు ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో ఫ్యామిలీ తరహా చిత్రాలలో ఎక్కువగా నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి ఆ తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.
దాదాపుగా పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు మన వేణు తొట్టెంపూడి.ఇక ఈ సినిమాలో సీఐ మురళిగా కనిపించబోతున్నారట వేణు.
ఈ సందర్భంగా తాజాగా మీడియా ముందుకు వచ్చిన వేణు ఇన్నాళ్ళ పాటు సినిమాలకు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది అన్న విషయాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ఇటివలే తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నేను నటించిన సిఐ మురళి పోస్టర్ ను విడుదల చేశారు.ఇక ఇలాంటి పాత్ర నేను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది అని తెలిపారు వేణు.
కాగా ఈనెల 29వ తేదీన ఈ సినిమా విడుదల అవుతుంది తప్పకుండా అందరూ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు వేణు.సినిమా ఎప్పటికీ నా మొదటి లవ్వు.
యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సినిమాలకు దూరంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు వేణు తొట్టెంపూడి.

ఈ సినిమాతో పాటుగా పారాహుషార్ అనే సినిమాలో కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నట్టు తెలిపాడు.అయితే నేను మళ్ళీ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చినందుకు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని తెలిపారు వేణు.కాగా ఇదివరకు తెలుగులో వేణు స్వయంవరం, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే,ఖుషి ఖుషీగా వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.మొత్తానికి వేణు తొట్టెంపూడి మళ్లీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చి పలు ప్రాజెక్టుల ద్వారా ప్రేక్షకుల రాబోతున్నాడు.
ఇక వేణు మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్నాడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.







