ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గ్రామం భారతదేశంలోనే ఉందని మీకు తెలుసా? ఇక్కడికి సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తారు.మండే వేసవిలో కూడా ఈ గ్రామంలో చల్లటి వాతావరణం ఉంటుంది.
ఈ కారణంగానే పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.మీరు కూడా హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈ గ్రామాన్ని సందర్శించాలనుకుంటే ఈ వేసవిలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఒకసారి చుట్టిరండి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ గ్రామం పేరు కౌమిక్, ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది.కౌమిక్ గ్రామం సముద్ర మట్టానికి సుమారు 15,027 అడుగుల ఎత్తులో ఉంది.
ఇక్కడ పలు అందమైన ప్రదేశాలు కనిపిస్తాయి.ఈ గ్రామంలో ప్రకృతి సౌందర్యం ఎవరి హృదయాన్నయినా గెలుచుకుంటుంది.
హిమాచల్ ప్రదేశ్ కొండలతో కూడిన రాష్ట్రం.ఇక్కడ సుందరమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.
ఈ కారణంగానే చాలా మంది పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి పర్వతాలు, మైదానాలు, జలపాతాలను చూసి పులకించిపోతుంటారు.మీరు ఈ గ్రామంలో బైక్‌పై కూడా తిరగవచ్చు.కౌమిక్ గ్రామం.14వ శతాబ్దానికి చెందిన లుండప్ త్సెమో గొంప బౌద్ధ విహారం.ఇక్కడికి బౌద్దులు కూడా భారీగా తరలివస్తుంటారు.మహిళలకు ప్రవేశం లేని ఇక్కడున్న ఒక మఠంలో రోజుకు రెండుసార్లు ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తారు.ఇది ప్రపంచంలోనే ఎత్తైన బౌద్ధ విహారంగా గుర్తింపు పొందింది.ఇక్కడ అందమైన అనేక కుడ్యచిత్రాలు కనిపిస్తాయి.
ఈ గ్రామాన్ని సందర్శించడం ద్వారా చాలామంది ప్రశాతతను పొందామని తెలిపారు.కొత్తదనాన్ని చూసిన అనుభవం కలిగిందని తెలిపారు.
ఇక్కడున్న మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వేసవిలో కూడా ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది.జూన్ నెలలో కూడా ఇక్కడి ఉష్ణోగ్రత 7 నుండి 9 డిగ్రీల వరకు ఉంటుంది.







