ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
దీంతో సీక్వెల్ ప్లాన్ చేసాడు నీల్.ఈ సినిమా పై కీడా అంచనాలు భారీగా ఉన్నాయి.
అందుకే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అంతటా భారీ బిజినెస్ చేసింది.ఈ సినిమా భారీ స్థాయిలో ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా రిలీజ్ కు మరొక రెండు రోజులు మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ ను వేగంగా చేస్తున్నారు.
తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ ప్రొమోషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
కెజిఎఫ్ టీమ్ అంతా ప్రొమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీ గా గడుపు తున్నారు.ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రొమోషన్స్ కానిచ్చేసిన టీమ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ద్రుష్టి పెట్టారు.
తాజాగా టీమ్ అంతా ప్రెస్ మీట్ లో పాల్గొంది.ఇందులో నీల్ చిరు పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
తనకు ఇన్స్పిరేషన్ మెగాస్టార్ అంటూ చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే ప్రతీ హీరోకి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ నే అయితే తన సినిమాల్లో హీరోను ఎలివేట్ చేయడం మాత్రం చిరు సినిమాను చూసే నేర్చుకున్నానని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు.”నేను చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూస్తూనే పెరిగాను.నా సినిమాలో హీరోకు ఎలివేషన్ ఇచ్చే సీన్స్, మాస్ ఎలిమెంట్స్ సీన్స్ బావుంటాయని చెప్తున్నారు.
అందుకు కారణం చిరంజీవి గారే.ఆయన నా ఫెవరెట్ హీరో.
ఆయన సినిమాల్లో చూపించే మాస్ సీన్స్, ఎలివేషన్స్ నన్ను చాలా ప్రభావితం చేసారు.నా హీరో కూడా అలాగే ఉండాలి అనుకున్నాను” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.







