ఇదేంటిది ..! కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంపై అధిష్టానం ఆగ్రహం ?

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పోటీ అంతా బిఆర్ఎస్, కాంగ్రెస్( BRS Congress ) ల మధ్యనే నెలకొంది.కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే సర్వే నివేదికలు ఆ పార్టీలో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి .

 This Is Is The Leadership Angry At The Congress Election Campaign , Telangana-TeluguStop.com

దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు ధీమాతో ఉన్నారు.క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజల్లో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఆశించిన స్థాయిలో ఎన్నికల ప్రచారం జరగడంలేదనే అసంతృప్తితో కాంగ్రెస్ అధిష్టానం ఉంది .ముఖ్యంగా స్టార్ క్యాంపైనర్లు ఎన్నికల ప్రచారంపై సరిగా దృష్టి సారించడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ పరిస్థితిని చక్కగా దిద్దేందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ గాంధీభవన్ కు వచ్చి నిన్ననే పరిస్థితి సమీక్షించారు.

Telugu Kc Venugopal, Pcc, Priyanka Gandhi, Rahul Gandhi, Revanth Reddy, Telangan

అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రతిరోజు రెండు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తోంది అని,  కేసీఆర్ , హరీష్ రావు , కేటీఆర్ ( KCR Harish Rao KTR )లు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారని,  అలాగే పార్టీలో అసంతృప్త  నేతలను బుజ్జగిస్తూనే నియోజకవర్గ పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారని,  కానీ కాంగ్రెస్ లో ఆ స్థాయిలో జోష్ కనిపించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.   నిన్న ఇందిరా భవన్ లో కాంగ్రెస్ కీలక నేతలతో కేసి వేణుగోపాల్ వర్చువల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరు పైన ఆయన ఆరా తీశారు .ఎక్కడెక్కడ ఎంతసేపు సమావేశాలు నిర్వహిస్తున్నారు,  ప్రచారం ఏ విధంగా సాగుతుందనే విషయాల పైన ఆరా తీశారు.  వర్చువల్ మీటింగ్ లోనే కేసి వేణుగోపాల్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

  ప్రచారం అనుకున్న స్థాయిలో జరగడంలేదని , ఇలా అయితే ఎలా అంటూ తెలంగాణ కాంగ్రెస్  నేతలను ప్రశ్నించినట్లు సమాచారం.

Telugu Kc Venugopal, Pcc, Priyanka Gandhi, Rahul Gandhi, Revanth Reddy, Telangan

 కొంతమంది కాంగ్రెస్ కీలక నేతలు కేవలం తమ నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారని , ఆయా జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )తప్ప మిగిలిన నేతలు ఎవరు గ్రౌండ్ లెవెల్ లో యాక్టివ్ గా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు .మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే శ్రద్ధ ప్రచారంలోని పెట్టాలని సూచించారు.ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సభలపైన వేణుగోపాల్ ఆరా తీశారు. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ సభల నిర్వహణ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేదాన్ని ఆరా తీశారు.

సభలకు భారీగా జన సమీకరణ చేపట్టాలని సూచించారు.స్టార్ క్యాంపైనర్స్,  కోఆర్డినేషన్ టీమ్ లను త్వరగా ఏర్పాటు చేయాలని వేణుగోపాల్ సూచించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube