ఇదేంటిది ..! కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంపై అధిష్టానం ఆగ్రహం ?

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పోటీ అంతా బిఆర్ఎస్, కాంగ్రెస్( BRS Congress ) ల మధ్యనే నెలకొంది.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే సర్వే నివేదికలు ఆ పార్టీలో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి .

దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు ధీమాతో ఉన్నారు.క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజల్లో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఆశించిన స్థాయిలో ఎన్నికల ప్రచారం జరగడంలేదనే అసంతృప్తితో కాంగ్రెస్ అధిష్టానం ఉంది .

ముఖ్యంగా స్టార్ క్యాంపైనర్లు ఎన్నికల ప్రచారంపై సరిగా దృష్టి సారించడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.

ఈ పరిస్థితిని చక్కగా దిద్దేందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ గాంధీభవన్ కు వచ్చి నిన్ననే పరిస్థితి సమీక్షించారు.

"""/" / అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రతిరోజు రెండు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తోంది అని,  కేసీఆర్ , హరీష్ రావు , కేటీఆర్ ( KCR Harish Rao KTR )లు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారని,  అలాగే పార్టీలో అసంతృప్త  నేతలను బుజ్జగిస్తూనే నియోజకవర్గ పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారని,  కానీ కాంగ్రెస్ లో ఆ స్థాయిలో జోష్ కనిపించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.

   నిన్న ఇందిరా భవన్ లో కాంగ్రెస్ కీలక నేతలతో కేసి వేణుగోపాల్ వర్చువల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరు పైన ఆయన ఆరా తీశారు .

ఎక్కడెక్కడ ఎంతసేపు సమావేశాలు నిర్వహిస్తున్నారు,  ప్రచారం ఏ విధంగా సాగుతుందనే విషయాల పైన ఆరా తీశారు.

  వర్చువల్ మీటింగ్ లోనే కేసి వేణుగోపాల్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

  ప్రచారం అనుకున్న స్థాయిలో జరగడంలేదని , ఇలా అయితే ఎలా అంటూ తెలంగాణ కాంగ్రెస్  నేతలను ప్రశ్నించినట్లు సమాచారం.

"""/" /  కొంతమంది కాంగ్రెస్ కీలక నేతలు కేవలం తమ నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారని , ఆయా జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )తప్ప మిగిలిన నేతలు ఎవరు గ్రౌండ్ లెవెల్ లో యాక్టివ్ గా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు .

మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే శ్రద్ధ ప్రచారంలోని పెట్టాలని సూచించారు.ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సభలపైన వేణుగోపాల్ ఆరా తీశారు.

రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ సభల నిర్వహణ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేదాన్ని ఆరా తీశారు.

సభలకు భారీగా జన సమీకరణ చేపట్టాలని సూచించారు.స్టార్ క్యాంపైనర్స్,  కోఆర్డినేషన్ టీమ్ లను త్వరగా ఏర్పాటు చేయాలని వేణుగోపాల్ సూచించారట.

నదిలో పడి ఆత్మహత్యకు యత్నం.. అతడిని బయటికి లాగి ఎట్లా కొట్టాడో చూస్తే..??